షేర్లున్న ఛానల్‌లో చిరు సినిమాకు బంపర్ ఆఫర్
చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150వ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా చేయడంతో.. క్రేజ్ ఏర్పర్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఊహించని రేటుతో ఓవర్
చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150వ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా చేయడంతో.. క్రేజ్ ఏర్పర్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఊహించని రేటుతో ఓవర్‌సీస్ రైట్స్ ఓ సంస్థ దక్కించుకుంది. అదికూడా చిరంజీవి అభిమాని అయిన ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ ముందుకు రావడం విశేషం.
కాగా, మరోసారి.. శాటిటైల్ రైట్స్ విషయం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు మాటీవీ చేజిక్కించుకుంది. ఏకంగా రూ.14 కోట్లను ఇచ్చి తీసుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో రేటు పలకడం.. వెనుక చిరంజీవి స్టామినాతోపాటు.. ఆ ఛానల్‌లో ఇంకా షేర్లున్న చిరంజీవి కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇక అదే ఛానల్‌లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కూడా త్వరలో చిరంజీవి చేయబోతున్నాడు.