Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడో లేదో కాలమే చెప్తోంది: చిరంజీవి

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్‌లో నిజాయితీ ఉంది. ఐడియాలజీ ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అవసరం. అలాంటి వాళ్ల ద్వారానే

Advertiesment
Chiranjeevi Comments about Pawan kalyan political entry
, బుధవారం, 11 జనవరి 2017 (09:13 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్‌లో నిజాయితీ ఉంది. ఐడియాలజీ ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అవసరం. అలాంటి వాళ్ల ద్వారానే ప్రక్షాళన జరుగుతుంది. ఒక రకంగా కొత్త రాజకీయాలకు అవకాశాలు లభిస్తాయి. కానీ అతనెంతవరకు సక్సెస్ అవుతాడనేది.. కాలమే చెప్తుందని.. అంతవరకు వేచి చూడాలని చిరంజీవి వ్యాఖ్యానించారు. 
 
ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా.. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించకూడదు. ఇక 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి వినోదపు పన్ను మినహాయింపుపై కూడా చిరంజీవి మాట్లాడుతూ.. గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే 'రుద్రమదేవి'కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేదని చిరు వ్యాఖ్యానించారు. 
 
రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఆంధ్రాలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. 'ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ'ని అనుకోవచ్చునని.. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోందని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథ + కథనం + వినోదం + సందేశం + ఉద్వేగభరిత సన్నివేశాల మేళవింపు = "ఖైదీ" (రివ్యూ).. బంపర్ హిట్ టాక్..