Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖైదీలకు దగ్గరగా వెళ్లకూడదు... చిరంజీవి 61వ బర్త్ డే హంగామా...

ఖైదీలను దూరంగా చూడాలి. దగ్గరకు వెళితే అంతే సంగతులు.. అవమానాలు ఎదురుదెబ్బలు తగుతులంటాయి.. ఇది సోషల్‌ మీడియాలో సెటైర్‌గా చిరంజీవి గురించి వస్తుంది. ఫిలింనగర్‌లో ఇదే విషయమై హాట్‌టాపిక్‌గా మారింది. చిరంజీవి పుట్టినరోజైన సోమవారం రాత్రి సినిమా ఇండస్ట్రీకి

Advertiesment
chiranjeevi birthday hungama
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (17:19 IST)
ఖైదీలను దూరంగా చూడాలి. దగ్గరకు వెళితే అంతే సంగతులు.. అవమానాలు ఎదురుదెబ్బలు తగుతులంటాయి.. ఇది సోషల్‌ మీడియాలో సెటైర్‌గా చిరంజీవి గురించి వస్తుంది. ఫిలింనగర్‌లో ఇదే విషయమై హాట్‌టాపిక్‌గా మారింది. చిరంజీవి పుట్టినరోజైన సోమవారం రాత్రి సినిమా ఇండస్ట్రీకి విందు ఏర్పాటు చేశారు. జంబో జట్టు హీరోలంతా కలిసి పార్టీని జూబ్లీహిల్స్‌లోని పార్క్‌ హయత్‌లో పార్టీ ఇచ్చారు. రెడ్‌ కార్పెట్‌ పార్టీ అది. ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం. 
 
ఫ్యాన్స్‌కూ లేదు. అయితే ఫ్యాన్స్‌కు మధ్యాహ్నమే భోజన ఏర్పాట్లు జరిగాయి. రాత్రి కూడా శిల్పకళా వేదికలో జరిగాయి. ఇక ఇండస్ట్రీలో తనవారికి చిరంజీవి పార్టీ ఇచ్చి అరగంటకు ముందే ఇలా ఇస్తున్నట్లు చిరు పిఆర్‌ఓలు మెసేజ్‌లు ఇచ్చారు. అయితే అక్కడకు వచ్చినా లాభంలేదని అర్థం. మరి మీడియా ఊరుకుంటుందా! హాట్‌ టాపిక్‌ ఏమి జరుగుతుందోనని ఎగబడ్డారు. అర్థరాత్రి దాకా వెయిట్‌ చేశాక పార్టీకి హాజరైన వివిఐపీల ఫొటోలను బైట్‌ను చరణ్‌ను అడిగితే.. గంటలో ఇంటికి రమ్మని చెప్పాడు. పొలోమంటూ.. అంతా ఎగేసుకుంటూ రోడ్‌నెం.25లో రామ్‌చరణ్‌ ఇంటికి వెళ్లి వారు ఇచ్చిన ఫొటోలు ఛానల్‌ బైట్స్‌కు తీసుకొచ్చారు. ఇదంతా ఏదో సాధించామన్న ఫీలింగ్‌ మినహా.. ఒరిగింది ఏమీలేదు. మీడియాను ఈ రకంగా ఉపయోగించుకున్నందుకు అందరూ వారిని అభినందిస్తున్నారు. ఈ విషయం తెలిసి.. పైవిధంగా సెటైర్లు వేశారు.
 
కట్టప్పలు చాలామంది
 
ఇదిలావుండగా ఈ విషయంలో.. మెగా కాంపౌండ్‌ మనుషులు జరిగిన అసౌకర్యానికి కించిత్‌ సానుభూతి చూపుతూ.... ఇక్కడ అంతా కట్టప్పలే వున్నారు. చిరుకు కట్టప్పలుగా మేమున్నామనీ మీరు.. ఆర్గనైజేషన్‌కు కట్టప్పలు కనుక.. ఇందులో ఎవరిదీ తప్పులేదని.. సోషల్‌ మీడియాలో వివరణ ఇవ్వడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లే లడక్‌లో పాటలు పూర్తి చేసుకున్న "ఇది నా లవ్ స్టోరీ"