'ఖైదీ నంబర్ 150' బాస్ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్‌కి 'ధృవ' ఫంక్షన్‌లో మెగా ట్రీట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'ఖైదీ నంబర్ 150'పైనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 150వ సినిమా `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) ఫస్ట్‌లుక్, టీజర్ నుంచి సంచలనాలు మొదలైన
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'ఖైదీ నంబర్ 150'పైనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 150వ సినిమా `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) ఫస్ట్‌లుక్, టీజర్ నుంచి సంచలనాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌లో, ప్రేక్షకాభిమానుల్లో ఇప్పుడు ఒకటే క్యూరియాసిటీ. ఆ ఉత్కంఠను రెట్టింపు చేసేలా బాస్ యాక్షన్ స్టైల్‌ని ఎలివేట్ చేసే ఓ ఇంట్రెస్టింగ్ స్టిల్ ఒకటి రిలీజైంది. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'ధృవ' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఈ స్టిల్‌ని రిలీజ్ చేయడం విశేషం.
ఈ స్టిల్ చూశాక.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాఫ్యాన్స్ ఒకటే ఖుషీ అయిపోయారు. మెగాస్టార్ మునుపటి ఛరిష్మాను సంతరించుకుని మరోసారి ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చేస్తున్నారు. 'గ్యాంగ్‌లీడర్', 'ఘరానా మొగుడు' లెవల్లో బాస్ ఇచ్చిన ఆ ఫోజు మెగాఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని డబుల్ చేసింది.
యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన స్టిల్ ఒక్కటి చూస్తేనే ఇంత కిక్కు పెరిగింది. ఇక పూర్తి స్థాయి సినిమాలో బాస్ యాక్షన్ ఏ రేంజులో ఉంటుందో తెరపై చూడాల్సిందే. ఈ సంక్రాంతి కానుకగా జనవరిలో క్రేజీగా బాస్ ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చేస్తున్నారు. టిల్ దెన్.. వెయిట్ అండ్ సీ..