Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజిత్ "తెగింపు''తో తంటా... లారీపై డ్యాన్స్ చేస్తూ అభిమాని మృతి

Advertiesment
అజిత్
, బుధవారం, 11 జనవరి 2023 (18:22 IST)
కోలీవుడ్ అజిత్ కుమార్  కొత్త సినిమా తెగింపు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల్లో భాగంగా ఫ్యాన్స్ సాహసాలు చేస్తుంటారు. తాజాగా విడుదల సెలెబ్రేషన్ లలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ ముందు లారీపై డ్యాన్స్ లేస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరంలోకి రోహిణి థియేటర్ లో తెగింపు సినిమా అర్థరాత్రి ఒంటి గంటకు స్పెషల్ షో ప్రదర్శించారు. ఆ సమయంలో ఫ్యాన్స్ థియేటర్ ముందు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో అజిత్ అభిమాని భరత్ కుమార్ (19) థియేటర్ మందు హైవేపై నెమ్మదిగా కదులుతున్న ఓ లారీపై డ్యాన్స్ చేస్తున్నాడు. 
 
అలా చేస్తూనే లారీ నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక భరత్ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడుద‌ల‌కు సిద్దమైన శివ కందుకూరి భూతద్ధం భాస్కర్‌ నారాయణ