Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రస్తుత హీరోలు.. ఎన్టీఆర్, బిగ్‌ బిలా ఫీల్ అవుతున్నారు.. సీనియర్ ఆర్టిస్టుల్ని గౌరవించట్లేదు: చంద్రమోహన్

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ ప్రస్తుత నటీనటులపై ఫైర్ అయ్యారు. ప్రస్తుత హీరోలు ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అవుతున్నారని, సీనియర్ ఆర్టిస్టులను ఏ మాత్రం గౌరవించడం లేదని చంద్రమోహన్ తెలిపారు. ప్రస్తుత

Advertiesment
chandra mohan comments on latest heroes
, సోమవారం, 21 నవంబరు 2016 (09:57 IST)
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ ప్రస్తుత నటీనటులపై ఫైర్ అయ్యారు. ప్రస్తుత హీరోలు ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అవుతున్నారని, సీనియర్ ఆర్టిస్టులను ఏ మాత్రం గౌరవించడం లేదని చంద్రమోహన్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలు, ఫైట్లు, అశ్లీలత కామన్‌ కథలుగా మారిపోయాయని, కామెడీ పండటం లేదన్నారు.

ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన కార్తీకవన సమారాధనలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా చంద్రమోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. 50ఏళ్ల సినీ ప్రస్థానం తృప్తినిచ్చిందన్నారు. ఇప్పటిదాకా 800పైగా చిత్రాల్లో నటించానని చెప్పారు. 
 
రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని, ఆ నాటి మధురజ్ఞాపకాలను నేటికీ మరువలేనన్నారు. బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివి 1962లో ఏలూరులోనే తనకు ఉద్యోగం వచ్చిందన్నారు.

ఏలూరులో సైకిల్‌పై తిరిగేవాడినని అప్పటి నుంచే అంబికా కుటుంబ సభ్యులతో అనుబంధం ఉందని.. వారి ఇంటిలో ఏ శుభకార్యాలు జరిగినా తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఆ రోజుల్లో సినిమా వంద రోజులు ఆడితే గొప్ప అని, ఇప్పుడు కేవలం రెండు వారాలకే సినిమాలు మారిపోతున్నాయని చంద్రమోహన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుస్ సరసన గౌతమి కుమార్తె సుబ్బులక్ష్మి.. వేలై ఇల్లా పట్టదారి-2లో హీరోయిన్