Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ప్రోమో బుర్జ్ ఖలీఫాలో గ్రాండ్ గా లాంచ్

sonusood team

డీవీ

, శనివారం, 3 ఫిబ్రవరి 2024 (16:59 IST)
sonusood team
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్‌ను దుబాయ్‌లో (2 ఫిబ్రవరి 2024) అద్భుతమైన షో తో కిక్ స్టార్ చేశారు. గ్లోబల్ మెట్రోపాలిస్, వండర్ ఫుల్ బుర్జ్ ఖలీఫాపై ఈ సీజన్ ప్రోమోను లాంచ్ చేశారు. CCL మొత్తం 8 జట్ల నుండి సూపర్ స్టార్లు, కెప్టెన్లు కిచ్చా సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య, జీవా (తమిళం), థమన్ & సుధీర్ బాబు (తెలుగు), జిస్సు సేన్‌గుప్తా (బెంగాల్), బన్ను ధిల్లాన్, సోనూ సూద్ (పంజాబీ), ఇంద్రజిత్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ (మలయాళం)  దుబాయ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు.
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది సినిమా, క్రికెట్‌ను కలిపే స్పోర్టైనైమెంట్. భారతదేశంలో 8 విభిన్న భాషల నుండి 200+ మంది నటీనటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్ లీగ్. ఇది క్రీడలు, వినోదాల కలయిక. గ్రాండియస్ లీగ్ ఫిబ్రవరి 23న షార్జాలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మరో మూడు వీకెండ్స్ లో 20 యాక్షన్-ప్యాక్డ్, అద్భుతమైన మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంది. ఆడ్రినలిన్-పంపింగ్ టోర్నమెంట్ సోనీ స్పోర్ట్స్ టెన్ 5,  జియో సినిమా, పలు ప్రాంతీయ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, “CCL మొదటి నుంచి అద్భుతంగా అలరిస్తుంది. ప్రతి సంవత్సరం లీగ్ వృద్ధి చెందడం లీగ్ లో క్రికెట్ ఆడే ప్లేయర్స్ ప్యాషన్ కి ప్రతిబింబం. CCL 2024 గతంలో కంటే బిగ్గర్ గా ఉండబోతుంది'' అన్నారు
 
బుర్జ్ ఖలీఫా ప్రోమో లాంచ్ గురించి కిచ్చా సుదీప్ మాట్లాడుతూ, “నేను ఇంతకుముందు నా సినిమాల కోసం బుర్జ్ ఖలీఫా వచ్చాను. క్రికెటర్‌గా బుర్జ్ ఖలీఫాలో వుండటం చాలా ప్రత్యేకమైనది, మరచిపోలేనిది''అన్నారు.
 
సోనూ సూద్  మాట్లాడుతూ “మన గొప్ప దేశంలోని 8 పవర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్‌స్టార్‌లతో కలిసి ఉండటం, ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్ నిర్మాణం ముందు నిలబడి మొత్తం భారతదేశం ఉద్వేగభరితంగా ఇష్టపడే లీగ్  ప్రారంభోత్సవాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ సంవత్సరం CCL  అద్భుతమైన ఎడిషన్‌గా అలరిస్తుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని అందుకుంటాం : ఈగల్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్