Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊహలకు రెక్కలు తొడిగిన మహాద్భుతం: బాహుబలి-2 పై చిత్ర సీమ ప్రశంసల వర్షం

మాటల్లేవు.. సామాన్య ప్రేక్షకులు ఎలాగూ ఫిదా అయిపోయారు. ఇక చిత్రసీమ ప్రముఖుల వంతు వచ్చింది. మెదడుకు మేత పెడతారని పేరున్న అతిగొప్ప దర్శకులు, నటులు, కళాకారులు బాహుబలి2 ని, రాజమౌళిని వేన్నోళ్ల పొగడుతూ అబిన

ఊహలకు రెక్కలు తొడిగిన మహాద్భుతం: బాహుబలి-2 పై  చిత్ర సీమ ప్రశంసల వర్షం
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (09:56 IST)
మాటల్లేవు.. సామాన్య ప్రేక్షకులు ఎలాగూ ఫిదా అయిపోయారు. ఇక చిత్రసీమ ప్రముఖుల వంతు వచ్చింది. మెదడుకు మేత పెడతారని పేరున్న అతిగొప్ప దర్శకులు, నటులు, కళాకారులు బాహుబలి2 ని, రాజమౌళిని వేన్నోళ్ల పొగడుతూ అబినందనలు తెలుపుతున్నారు. అద్భుతమైన మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు సాహో అంటున్నారు. ఎంటర్‌ అయ్యేటప్పుడు డైరెక్టర్‌ లాగా వెళ్లాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లాగా వచ్చాను అని అంటున్నారు. ‘బాహుబలి–2’ భారతీయ సినిమా ఫైనెస్ట్‌ కాన్వాస్‌ అంటున్నారు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి ఒక్కర్నీ రాజమౌళి ప్రేమించారు కాబట్టే అంత గొప్ప చిత్రం తయారైంది అంటున్నారు. ఇప్పుడిక భారతీయ సినిమా ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అయింది అంటున్నారు.  చిత్రరంగ ప్రముఖుల హృదయపు లోతుల నుంచి వచ్చిన ఈ అబిప్రాయాలు వారి మాటల్లోనే విందామా?
 
 
సాహో రాజమౌళి : క్రిష్‌
సినిమా పూర్తయ్యాక చప్పట్లు కొట్టాను. తెర మీద రాజమౌళి స్టాంప్‌ కనిపించగానే ఈల వేశాను. ‘న్యూ కైండ్‌ ఆఫ్‌ మూవీ’. విజయేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్రలు రాశారు. రాజమౌళిగారు అంతే అద్భుతంగా తీశారు. ప్రభాస్, రానా, అనుష్క.. ఇలా అందరి నటన వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంది. ∙ఎమోషనల్‌గా ఈ సినిమా ఎపిక్‌ లెవల్‌లో ఉంది. మొదటి నుంచి చివరి వరకూ ఎంతో గ్రిప్పింగ్‌గా తీశారు. అద్భుతమైన మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు సాహో రాజమౌళిగారు.
 
సినిమా మొదట్లో తల్లి శివగామి (రమ్యకృష్ణ) అడుగు తప్పకూడదని అమరేంద్ర బాహుబలి రథాన్ని ముందుకు తీసుకు వస్తాడు. అది ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. అలాగే, సినిమా చివర్లో తల్లి దేవసేన (అనుష్క) అడుగు తప్పకూడదని మహేంద్ర బాహుబలి తపన పడతాడు. ఆరంభంలో ఎంత ఎమోషనల్‌గా ఉందో చివర్లోనూ అంతే ఎమోషనల్‌గా ఈ సీన్స్‌ ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చాయి. ∙నిర్మాతలు శోభు, ప్రసాద్‌గార్లను అభినందించాల్సిందే. ఇండియన్‌ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా నిర్మించారు. వీళ్లకెవరూ సాటి రారు.
 
నాకా అర్హత ఉందా అనిపించింది : సుకుమార్‌
నేను కూడా సినిమా గురించి అందరిలాగానే ఎదురు చూశాను. బాహుబలి ఎలా ఉండబోతుందో అనే ఆలోచనలతో థియేటర్‌లోకి ఎంటర్‌ అయ్యాను. ఎంటర్‌ అయ్యేటప్పుడు డైరెక్టర్‌ లాగా వెళ్లాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లాగా వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు అడుగుతుంటే ఇవ్వాలా? వద్దా అని ఆలోచించాను. ఎందుకంటే... అవి ఇచ్చే అర్హత ఉందా లేదా అని. అంతే కానీ పొగరుతో కాదు. ఇంతకంటే ఏమని చెప్పను సినిమా గురించి. బాహుబలి స్పెక్టాక్యులర్‌ మూవీ.
 
మన తరంలో ఉన్న ఉత్తమ దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ఆయన తీసిన అద్భుత చిత్రం ‘బాహుబలి’. ఇటువంటి జినీయస్‌ డైరెక్టర్‌కి నా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉంది.
– దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌
 
‘బాహుబలి–2’ భారతీయ సినిమా ఫైనెస్ట్‌ కాన్వాస్‌. ఒక్క తెలుగు సినిమానే కాదు.. రాజమౌళి మొత్తం భారతీయ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. రాజమౌళి విజన్‌ని తమ అద్భుత నటనతో సపోర్ట్‌ చేసినందుకు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలకు అభినందనలు. రాజమౌళి విజన్‌కి జీవం పోయడానికి ఈ చిత్రాన్ని నిర్మించిన శోభు, ప్రసాద్‌లకు, నటించిన ఇతర నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణులకు అభినందనలు.
– హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌
 
నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామ. తెలుగు వారందరూ గర్వపడేలా సినిమా తీశారు. సినిమా పండగలా ఉంది.
– హీరో నాని
 
శుక్రవారం ఉదయం ‘బాహుబలి 2’ చిత్రం చూశా. రాజమౌళిగారికి దండాలు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి ఒక్కర్నీ ఆయన ప్రేమించారు.
– మంచు మనోజ్‌
 
బాహుబలిలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏదో ఉంది. కొన్ని సినిమాలను చూసినప్పుడు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంటుంది. అలాంటి వాటికి ఉదాహరణే ‘బాహుబలి’.
– హీరో రామ్‌
 
బాహుబలి ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. మొత్తం టీమ్‌కి సెల్యూట్‌. ప్రభాస్‌ నటన నచ్చింది. ఈ సినిమా ఓ మాస్టర్‌ పీస్‌ లాంటిది.
– హీరో ధనుష్‌
 
‘బాహుబలి–2’ గురించి మంచి రిపోర్ట్స్‌ అందుతున్నాయి. ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఉన్నాను. ఈ ట్రిప్‌కి ముగింపు పలికి ‘బాహుబలి’ చూడాలనుకుంటేన్నాను. ‘డార్లింగ్‌’ ప్రభాస్, రాజమౌళిగారు తదితర బృందానికి శుభాకాంక్షలు.
– దర్శకుడు కొరటాల శివ
 
భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు రాజమౌళిసార్‌కి, ఆయన సైన్యానికి అభినందనలు. ప్రభాస్, రానాతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్‌ ఐదేళ్లు అంకితభావంతో చేసిన కృషికి నిదర్శనమే ‘బాహుబలి’.  ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి సినిమాకి గౌరవం ఇవ్వండి. ఇప్పుడిక భారతీయ సినిమా ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అయింది. ద వన్‌ అండ్‌ ఓన్లీ డార్లింగ్‌ ప్రభాస్‌ ఎప్పటిలాగే తన హీరోయిజాన్ని ప్రదర్శించటానికి ఇంకా ఇష్టపడ్డాడు.  కీరవాణిగారి నేపథ్య సంగీతం ప్రతి క్షణం ఎంతో తీవ్రత కలిగించింది.
– హీరో అఖిల్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా పిచ్చి ఉన్నోళ్ల ధూల తీర్చేసిన రాజమౌళీ హ్యాట్సాఫ్: కడుపు నిండిన ప్రేక్షకుల హర్షం