Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా దోస్తీ స్పెషల్ కార్యక్రమం, రౌడీ గారి పెళ్ళాంతో సరికొత్త రాయలసీమ కధాంశంతో జీ తెలుగు

దసరా దోస్తీ స్పెషల్ కార్యక్రమం, రౌడీ గారి పెళ్ళాంతో సరికొత్త రాయలసీమ కధాంశంతో జీ తెలుగు
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:32 IST)
దసరా- ఎన్నో ప్రాంతాలు వారి ఆచారాలకి తగట్టుగా చేసుకునే పండుగ. కొందరు రావణాసురుడి బొమ్మను దహనం చేస్తారు, మరి కొందరు బతుకమ్మ ఆడుతారు, ఇంకొందరు పార్వతి దేవి మహిషాసురుడిని వధించిన రోజు అంటారు. ఎలా పిలిచినా పండుగ తత్వం ఒకటే - చెడుని ఓడించి మంచి గెలుస్తుంది. మరి ఇలాంటి ఒక గొప్ప పర్వదినాన్ని మన జీ తెలుగు జరుపుకోకుండా ఉంటుందా?

 
తన అభిమానులకి స్పెషల్ కానుక ఇవ్వకుండా ఉంటుందా? అందుకే ఈ ఆదివారం అక్టోబర్ 10 సాయంత్రం 6 గంటలకు 'దసరా దోస్తీ' అనే స్పెషల్ కార్యక్రమంతో మనముందుకు వస్తుంది. అంతేనా, సోమవారం అక్టోబర్ 11 మధ్యాహ్నం 12 గంటలకు 'రౌడీ గారి పెళ్ళాం' అనే సరికొత్త ధారావాహికతో మనముందుకు వస్తుంది మన ప్రియమైన ఛానల్.

 
పండగ అనగానే చుట్టాలు, స్నేహితులు గుర్తుకొస్తారు. వారితో పాటు జీ తెలుగు కుటుంబం కూడా గుర్తుకొస్తుంది. తన అభిమానుల కోసం మరోసారి వారి ప్రియతమ నటీనటులందరినీ ఒక చోటచేర్చి ఈ పండుగను ఘనంగా జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా శ్రీముఖి నిర్వహించగా, స్పెషల్ గెస్ట్స్‌గా వైష్ణవ తేజ్ మరియు రోషన్ శ్రీకాంత్ రానున్నారు. వారిరువురు చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాంటే తప్పక చూడాల్సిందే. ఇక మన ఛానల్ ఆడవాలను కలిసి నవదుర్గ థీమ్ పైన పెర్ఫార్మన్స్ చేయబోతున్నారు. మన సూర్యకాంతం హీరో ప్రజ్వల్ సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని మంత్ర ముగ్ధుల్ని చేయగా, అనూష - కౌశల్‌తో కలిసి పప్పెట్ డాన్స్ చేస్తారు.

 
జీ తెలుగు అంటేనే కొత్త కధలకి పుట్టినిల్లు. బంధాలు, అనుబంధాల్ని ఒక సరికొత్త కోణంలో చూపించడంలో తనకుతానే సాటి. అలాంటి ఛానల్ మరోసారి ఒక వైవిధ్యమైన కథతో అందరి ముందుకు వస్తుంది. అదే 'రౌడీ గారి పెళ్ళాం'. ఈశ్వరి (అమిత) ఒక మంచి టీచర్, బాధ్యత గల మనిషి. అందరి మంచిచెడుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తోంది. శివ (ఆదర్శ్), కర్నూల్ కి రౌడీ, అమ్మలా చూస్కునే అమ్మాజీ (సుజాత)కి భక్తుడు. అమ్మాజీ మాటని ఎప్పుడూ కాదనడు.

 
అమ్మాజీ ఊరికి పెద్ద, తన మాటే శాశనం. అలాంటి అమ్మాజీ ఇంటికి కోడలిగా, శివకి భార్యగా కొన్ని కారణాల వళ్ళ ఆ ఇంట్లో అడుగుపెడుతుంది మన ఈశ్వరి. ఈ అత్తా-కోడళ్ళ సమరం ఏవిధంగా ఉండబోతుంది? ఈశ్వరి మంచితనమా లేదా అమ్మాజీ అహంకారామా? తెలుసుకోవాలంటే 'రౌడీ గారి పెళ్ళాం' చూడాల్సిందే. కర్నూల్ కధాంశంతో తిరిగే ఈ సిరియాలో అని రాయలసీమ రుచులు ఉండబోతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత విడాకుల‌కు ప్రీతమ్ జుకల్కర్‌ కారణమా?