Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయగీతాన్ని అవమానించారంటూ పవన్ కళ్యాణ్‌పై కేసు.. సినీ రచయితపై రాజద్రోహం

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్టర్

Advertiesment
Case booked against Pawan Kalyan in police station
, సోమవారం, 19 డిశెంబరు 2016 (10:47 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్టర్ పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పవన్ అవమానించారంటూ పిటీషనర్ అయిన హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
మరోవైపు.. జాతీయగీతాన్ని అవమానిస్తూ ఓ రచయిత ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో... ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. మలయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ అయిన కమల్ సీ చవరా జాతీయగీతాన్ని అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజద్రోహం కేసును నమోదు చేశారు. 
 
గతంలో ఆయన చేసిన ఫేస్‌బుక్ పోస్టులను కూడా పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. కమల్ పోస్టులపై కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కొల్లంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో, కోజికోడ్‌లో ఉన్న కమల్‌ను కొల్లంకు పోలీసులు తీసుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా : సినీ నటి భావన