ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు ఈ ఆల్బమ్ వివాదంలో చిక్కుకుంది. "హరే రామ హరే కృష్ణ" అంటూ సాగే ఈ పాట సాగుతోంది. దీనిపై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూభక్తుల మనోభావాలు కించపరిచేలా ఆల్బమ్ సాంగ్ రూపొందించినట్టు సంగీత దర్శకుడు దేవీశీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది.
ఇదే అంశంపై కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదులో "హరే రామ, హరే కృష్ణ అనే పవిత్ర భజనను ఓ ఐటెం సాంగ్‌గా మలిచారంటూ దేవీశ్రీ ప్రసాద్‌పై ఆరోపణలు వచ్చాయి. పవిత్ర మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని దేవీశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఆమెతో పాటు పలు హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగర నేర విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ వివాదంపై దేవీశ్రీ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఈ పాటను మూడు వారాల కిందట యూట్యూబులో పోస్టు చేయగా, ఇప్పటివరకు 2.5 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చుకున్నారు.