తాను నిర్మాతగా ఎవరినీ మోసం చేయలేదనీ, అలా మోసం చేయాలనే ఆలోచన కూడా తనకు లేదనీ, కొందరిని చూస్తుంటే ఇలాగ కూడా వుంటారా! అని ఆశ్చర్యం కలిగిందని భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర అన్నారు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఆయన కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఫేక్‌వని వీటి వెనుక ఎవరో వున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ ఎప్పటినుంచో తెలుసుననీ, అంతకుముందు ఏజెంట్ సినిమా విషయంలో ఆయన దెబ్బతిన్న మాట వాస్తవమే.
ఆ సినిమా తర్వాత సామజరవరగమన సినిమా ఇస్తానని చెబితే, చెత్త సినిమా నాకెందుకు? అన్నారని.. కానీ నేను పట్టుబట్టి ఆయనకు న్యాయం చేయాలని బలవంతంగా ఆ సినిమాను ఇచ్చాను. అది సూపర్ హిట్ అయింది. కానీ భోళాశంకర్ విషయంలో మాత్రం ఆయన ఇస్తానన్న 30 కోట్లు ఇంకా ఇవ్వలేదు. అందుకే టైం అయిపోతుందని ఆయన వైజాగ్ కు చెందిన కీ మాత్రమే ఇచ్చామని ఇందులో అన్యాయం ఏమీ లేదనీ, ఏదైనా కోర్టులో వున్న వ్యవహారం గనుక ఇంతకంటే ఏమీ మాట్లాడలేనని, ఏదైనా వుంటే గరికపాటి కృష్ణ కిశోర్‌తో తేల్చుకోవాలని సూచాయిగా అన్నారు.