Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైమా అవార్డ్స్... బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.... గమ్మునుండవోయ్(బన్నీ)... ఇలా ఉండుద్ది(పవన్)

మెగాప్యామిలీతో పవన్ అటాచ్‌మెంట్ గురించి.. కుటుంబ సభ్యుల్లో ఎవరెన్నిసార్లు క్లాసులు తీసుకున్నా.. ఫ్యాన్స్‌లో మాత్రం పెద్దగా మార్పులు కన్పించడం లేదు. 'మాట్లాడను బ్రదర్' అనే బన్నీ సింగిల్ డైలాగ్‌పై.. సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగింది. ఇక ఈ వివాదానికి ఫి

Advertiesment
Allu Arjun In Siima 2016
, మంగళవారం, 5 జులై 2016 (14:10 IST)
మెగాప్యామిలీతో పవన్ అటాచ్‌మెంట్ గురించి.. కుటుంబ సభ్యుల్లో ఎవరెన్నిసార్లు క్లాసులు తీసుకున్నా.. ఫ్యాన్స్‌లో మాత్రం పెద్దగా మార్పులు కన్పించడం లేదు. 'మాట్లాడను బ్రదర్' అనే బన్నీ సింగిల్ డైలాగ్‌పై.. సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగింది. ఇక ఈ వివాదానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ఫుల్‌గా ప్రిపేరైన బన్నీ... "ఒక మనసు' ఆడియో వేడుకలో తన మనసులోని మాటలు బయటపెడుతూ.. కాంట్రవర్సీని తగ్గించేందుకు మాగ్జిమమ్ కన్విన్స్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ దారికి వచ్చారని... ఇక వివాదం సమసిపోయినట్టేననుకున్నారంతా.
 
కానీ తాజాగా మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది. సింగపూర్‌లో జరుగుతున్న ‘సైమా’ అవార్డు వేడుకలకు హాజరైన బన్నీకి పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఎప్పటిలాగే పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేస్తూ.. బన్నీ స్పీచ్‌కు అడ్డుపడే ప్రయత్నం జరిగిందట. రీల్ లైఫ్‌లోనే కాక రియల్ లైఫ్‌లోనూ పంచ్ డైలాగులు చెప్పడం పర్ఫెక్ట్‌గా అలవాటైన బన్నీ కూడా.. ఇదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు. 'రుద్రమదేవి' సినిమాలో తన డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. ‘గమ్మునుండవోయ్.. మాట్లాడనీ’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.  
 
అయినా పవన్ ఫ్యాన్స్ ఆగలేదనుకోండి.. పైగా ఎప్పటిలాగే ఈ వివాదాన్ని సోషల్ మీడియాకు షిప్ట్ చేశారు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ బన్నీ వార్ నడుస్తోంది. ఎవరెన్ని చెప్పినా సేమ్ సీన్ రిపీట్ అవుతుందడటంతో పవన్ జోక్యంతోనే పరిస్థితి చక్కబడుతుందంటున్నారు సినీజనాలు. అయ్యా పవన్... ఇలా ఉండుద్ది అని చెప్తేనే వీళ్లాగరయ్యా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడేమో ధనుష్‌తో జోడీగా.. ఇప్పుడేమో శింబుకు తల్లిగా శ్రియ ఎలా..? త్రిష వద్దన్నాకే..!?