Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్.. జాగ్వార్ ఆడియోలో తళుక్కుమన్న హాస్యబ్రహ్మ

చాలా గ్యాప్ తర్వాత జాగ్వార్ ఆడియో ఫంక్షన్‌లో హాస్యబ్రహ్మ, సీనియర్ నటుడు బ్రహ్మనందం తళుక్కుమన్నారు. సినీ ఛాన్సులు లేకుండా.. సినీ ఫంక్షన్లకు దూరమైన బ్రహ్మానందం ఒక్కసారిగా జాగ్వార్ ఆడియోలో కనిపించడంతో అభ

Advertiesment
Brahmanandam Comedy Speech @ Jaguar Audio Launch
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:15 IST)
చాలా గ్యాప్ తర్వాత జాగ్వార్ ఆడియో ఫంక్షన్‌లో హాస్యబ్రహ్మ, సీనియర్ నటుడు బ్రహ్మనందం తళుక్కుమన్నారు. సినీ ఛాన్సులు లేకుండా.. సినీ ఫంక్షన్లకు దూరమైన బ్రహ్మానందం ఒక్కసారిగా జాగ్వార్ ఆడియోలో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోనందం మాట్లాడుతూ..  కేటీఆర్‌ ''తెలంగాణ ముద్దుబిడ్డ" అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో కార్యక్రమానికి హాజరైన సినీ స్టార్స్, సెలబ్రిటీలు, ప్రేక్షకుల చప్పట్లతో  సభాప్రాంగణం మార్మోగింది. 
 
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన జాగ్వార్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరిగింది. కేటీఆర్ హాల్‌లోకి రాగానే  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బ్రహ్మనందం హాస్య పలుకులతో వేడుకలో మరింత సందడి నెలకొంది.
 
సింధూతో ఫోటో దిగాలంటే స్టూలెక్కాల్సొచ్చిందని టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. వీపీ సింధూను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సింధూ అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతటా తెలుసని అన్నారు. భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో పతకం సాధించడం మాములు విషయం కాదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాహిద్ కపూర్ డాటర్ పేరేంటో తెలుసా.. ''మిషా''.. అమృతసర్ వెళ్ళి..