Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొమ్మ అదిరింది–దిమ్మ తిరిగింది.. వాయిదా పడింది..

బొమ్మ అదిరింది–దిమ్మ తిరిగింది.. వాయిదా పడింది..
, బుధవారం, 30 డిశెంబరు 2020 (17:01 IST)
Bomma Adirindi Dimma Thirigindi
షకలక శంకర్ ప్రధాన పాత్రలో ప్రియ - అర్జున్ కళ్యాణ్ - రాజ్ స్వరూప్ - మధు - స్వాతి - అవంతిక హీనా - రితిక చక్రవర్తి - సంజన చౌదరి నటీనటులుగా నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ''బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది''. కుమార్ కోట దర్శకత్వంలో  మధు లుకాలపు - సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
నిర్మాతలు మాట్లాడుతూ.. మేం అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగా రావడంతో పాటు బిజినెస్ కూడా అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ అందరూ మా సినిమాకు గురించి హ్యాపీగా ఉన్నారు. అయితే మేము సినిమా థియేటర్లు అన్ని ఓపెన్ అవుతాయి. మేము జనవరి 1న విడుదల చేయాలని అనుకున్నాం.  కొన్ని థియేటర్ ప్రాబ్లమ్స్ వలన మా డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు మా చిత్ర్రాన్నిపోస్ట్ పోన్ చేస్తున్నాము. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు
 
దర్శకుడు మాట్లాడుతూ... మా సినిమాలో ఫుల్ కామెడీ ఎంటర్టెన్మెంట్ మూవీ సినిమా చాలాబాగా వచ్చింది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 24న సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన  సెన్సార్ సభ్యులు ఇందులో కామెడీ చూసి చాలా రోజుల తర్వాత మేము నవ్వుకోవడం ఇదే మొదటిసారి అని చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. 
 
కోవిడ్ టైంలో కూడా చిత్ర యూనిట్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని  షూటింగ్ చేశాం. జనవరి 1న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన  సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ఎప్పుడు విడుదల చేయాలనేది త్వరలో తెలియజేస్తాము. ఈ సినిమా కామెడీ పరంగా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా.. చూసిన ప్రేక్షకులు 200% నవ్వుకుంటారనే  నమ్మకం ఉందని అన్నారు
 
హీరోయిన్స్ మాట్లాడుతూ డైరెక్టర్ గారికి ఇది మొదటి సినిమా అయినా తను నిద్ర లేకుండా  చాలా కష్టపడి పని చేశారు. షకలక శంకర్, దర్శక, నిర్మాతల సహకారం మరచిపోలేము. మేమందరం ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి వచ్చినట్లు సినిమాను పూర్తి చేయగలిగాం. మేమంతా ఈ సినిమా  విడుదల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాల్దీవుల్లో కైరా అద్వానీ.. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయింది..