Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిల్కీబోయ్ అంటే పిచ్చి... ఛాన్స్ వస్తేనా? : సంజన చౌదరి

మిల్కీబోయ్ అంటే పిచ్చి... ఛాన్స్ వస్తేనా? : సంజన చౌదరి
, సోమవారం, 28 డిశెంబరు 2020 (17:23 IST)
షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది''. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మధు లుకాలపు, సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్నారు. ప్రియ - అర్జున్ కళ్యాణ్ - రాజ్ స్వరూప్ - మధు - స్వాతి - అవంతిక హీనా - రితిక చక్రవర్తి - సంజన చౌదరి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర వర్మ అల్లూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పిఆర్ సంగీతం సమకూరుస్తున్నారు. 
 
హారర్ కామెడీ నేపథ్యంలో వ‌స్తోన్న 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది` త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న సంద‌ర్భంగా హీరోయిన్ సంజన చౌదరి చెప్పిన విశేషాలు..
 
* మా స్వ‌స్థలం బీహార్‌. నేను హైద‌రాబాద్‌లోనే చ‌దువుకున్నాను. జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్స్ చేశాను. 
* కాలేజ్ రోజుల్లో మూవీస్‌పై ఇంట్రెస్ట్‌తో బ్యూటీ కాంపిటేష‌న్స్‌లో పాల్గొన్నాను. ఆ త‌ర్వాత‌ మోడ‌ల్, అలా యాక్ట‌ర్‌ని అయ్యాను.
* `న్యూలీ మ్యారీడ్` అనే వెబ్ ఫిలిం చేశాను, శ్రేయాస్ ఈటీలో విడుద‌లైంది. 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది` హీరోయిన్‌గా నా రెండ‌వ చిత్రం. 
* ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్ట‌ర్‌. కొత్త‌గా పెళ్లి అయిన కొంత మంది స్నేహితులు క‌లిసి హాలీడే కోసం దూరంగా ఉన్న ఒక ఫాం హౌజ్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటారు. అక్క‌డికి వెళ్ల‌గానే స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం లాక్డౌన్ విధిస్తుంది. ఆ త‌ర్వాత ఆ ఇంట్లో వారికి కొన్ని అసాదార‌ణ సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వాటిని అంద‌రూ క‌లిసి ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఇంట్లో నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనేది క‌థాశం. 
 
* ఇది హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే కామెడీతో పాటు మరికొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. 
* ఈ సినిమా ఒక ఇంట్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అంద‌రం అక్క‌డే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాం. అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. షూటింగ్ పూర్త‌య్యే స‌రికి అంద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 
 
* ప్ర‌స్తుతం `క‌థ మొద‌లైంది` అని ఒక స‌స్పెన్స్ కామెడీ మూవీ చేస్తున్నాను. న‌టిగా పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లిగే అన్నిరకాల క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను. 
* న‌టిగా ప్ర‌తిరోజు ఎంతోకొంత నేర్చుకుంటూ న‌న్నునేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. తెలుగులో మ‌హేశ్‌బాబు నా ఫేవ‌రేట్ హీరో. మిల్కీబోయ్‌లా వుంటాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజ‌ల్‌కు పేరొచ్చింది.. నాకు డ‌బ్బులు పోయాయి : సి.క‌ళ్యాణ్‌