ఇలా అయితే అనుష్క పెళ్లి అయినట్లే.. బాలీవుడ్ రారా అంటోంది
బాహుబలి -2 సినిమా ప్రభాస్‌ను ఒక్కసారిగా జాతీయ హీరోను చేసినట్లే అనుష్కను బాలీవుడ్ కలల హీరోయిన్‌గా మార్చేసింది. రాజరికం పట్ల, రాజులు, రాణుల జ్ఞాపకాల పట్ల పిచ్చివ్యామోహం ప్రదర్శించే ఉత్తరాది ప్రజలు దేవ
బాహుబలి -2 సినిమా ప్రభాస్‌ను ఒక్కసారిగా జాతీయ హీరోను చేసినట్లే అనుష్కను బాలీవుడ్ కలల హీరోయిన్‌గా మార్చేసింది. రాజరికం పట్ల, రాజులు, రాణుల జ్ఞాపకాల పట్ల పిచ్చివ్యామోహం ప్రదర్శించే ఉత్తరాది ప్రజలు దేవసేన పాత్రలో అనుష్క సౌందర్యాన్ని, రాజదర్పాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారంటే ఆశ్చర్యంపడాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ పాత్రే అయినప్పటికీ అనుష్కకు సినిమా మొత్తం మీద ఇవ్వాల్సినంత నిడివి పాత్ర ఇవ్వలేదని రాజమౌళిని తిడుతున్నారు కూడా. బాలీవుడ్ ప్రముఖులు కొందరు కూడా ఇదేవిధమైన అభిప్రాయాలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అనుష్కను పెట్టి సినిమాలు తీయాలనే ఆలోచన కూడా కొందరు బాలీవుడ్ దర్శకులకు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అయితే అవకాశం ఇస్తే చాలు రాజమౌళి దర్శకత్వంలోనే ప్రభాస్, అనుష్క హీరో హరోయిన్‌గా సినిమా తీయడానికి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించేశాడు. అదే సమయంలో అనుష్కతో గతంలో ఒక సినిమా తీయాలని బాలీవుడ్‌లో తలపెట్టి మధ్యలోనే నిలిచిపోయిన ప్రయత్నం ఇప్పుడు మళ్లీ ముందుకొచ్చింది.
బాహుబలి-2 కారణంగా బాలీవుడ్‌లోనూ పాపులర్ అయిన అనుష్కతో సినిమాలు చేయడానికి పలువురు బీటౌన్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బొమ్మాళి బాలివుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవుతుందా లేదా అన్న విషయంలో ఎవరికీ అంతగా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే అనుష్క ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కాల్సి ఆగిపోయిన ఓ సినిమాను మళ్లీ పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
2014లో అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు ఈ నివాస్ జువైనెల్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. అయితే బొమ్మాళి అప్పట్లో బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రయత్నం నిలిచిపోయింది. దర్శకుడు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూలన పడింది. కానీ ఇప్పుడు బాహుబలి 2 బిగ్ సక్సెస్ పొందడంతో జువెనైల్ సినిమాను తెరకెక్కించే అవకాశాలు మళ్లీ కనిపస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణం విషయమై దర్శకుడు ఈ నివాస్ అనుష్కతో చర్చలు జరుపుతున్నాడని వినికిడి. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో అనుష్క జువైనెల్ సినిమాకు ఓకె చెప్పే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
కానీ సినిమాకు గుడ్ బై చెప్పాలని ఆమె అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్‌లో అడుగు పెట్టే చాన్స్ లేదని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే బాలీవుడ్‌లో జువైనెల్ సినిమాలో అనుష్క నటిస్తే మాత్రం ఆమె ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అందరి అభిప్రాయం.
కానీ అనుష్క బాలీవుడ్ వైపు అడుగేస్తే మాత్రం ఇప్పట్లో ఆమె పెళ్లి వార్త గురించి మర్చిపోవాల్సిందే మరి.