Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారు ఊరకుక్కలు.. ముళ్ళ బూట్లతో తన్నాలి: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాగబాబు వర్మను తనదైన స్టయిల్‌లో కడిగి పారేశారు. చిరంజీవి సైతం పరోక్షంగా నేను అలాంటి

వారు ఊరకుక్కలు.. ముళ్ళ బూట్లతో తన్నాలి: రామ్ గోపాల్ వర్మ
, శనివారం, 28 జనవరి 2017 (09:16 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాగబాబు వర్మను తనదైన స్టయిల్‌లో కడిగి పారేశారు. చిరంజీవి సైతం పరోక్షంగా నేను అలాంటి విలువ లేని మాటలకు స్పందించనని విమర్శించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు వచ్చింది.
 
''ఒకసారి పైకి ఎత్తేసి.. మరోసారి కిందకి దించేసే వ్యక్తుల గురించి నేనేం మాట్లాడాలి? ఈ మధ్యనే వర్మ కూతురుకి పెళ్ళైంది. కానీ పోర్న్ సినిమాలు కలెక్ట్ చేస్తూ ఉంటానని చెప్పే వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటూ పవన్, వర్మను ఉద్దేశించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా వర్మ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై జరిగిన దాడిపై స్పందించాడు. ఈ దాడిని రాంగోపాల్ వర్మ ఖండించారు. జైపూర్‌లో పద్మావతి చిత్రం షూటింగ్ జరుపుతుండగా బన్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలను వర్మ ఊరకుక్కలతో పోల్చారు. అంతటితో ఆగని ఆయన రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలను ముళ్ళ బూట్లతో తన్నాలన్నారు.
 
రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీలకు సంబంధించి బన్సాలీకి తెలిసినంత చరిత్రలో రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలకు కనీసం ఒక శాతం కూడా తెలీదని వర్మ చెప్పారు. భారత్‌లో ఇలాంటి దాడులు జరగడం శోచనీయమని వర్మ తీవ్రంగా మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందకోట్ల క్లబ్‌కు చేరువలో ఖైదీ నం. 150