వందకోట్ల క్లబ్‌కు చేరువలో ఖైదీ నం. 150
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చిత్రసీమలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అతి త్వరలో వంద కోట్ల క్లబ్‌లో చేరనున్నారు. ఇటీవల విడుదలైన చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నం. 150 సినిమా 95.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి రికార్డు సృష్టించింది. విడుదలైన16 రోజుల త
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చిత్రసీమలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అతి త్వరలో వంద కోట్ల క్లబ్‌లో చేరనున్నారు. ఇటీవల విడుదలైన చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నం. 150 సినిమా 95.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి రికార్డు సృష్టించింది. విడుదలైన16 రోజుల తర్వాత 95.5 కోట్ల ఆదాయం సాధించిన చిరు సినిమా అతి త్వరలోనే 100 కోట్ల రూపాయల మేజిక్ ఫీట్ సాదిస్తుందని భావిస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఇంతవరకు వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక సినిమాగా బాహుబలి ది బిగినింగ్ చరిత్ర సృష్టించింది.
భారీ బడ్జెట్‌తో తీసిన ఖైదీ నం. 150 సినిమా కొనుగోళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించింది. గౌతమి పుత్ర శాతకర్ణితో తీవ్రమైన పోటీని ఎదుర్కొని కూడా బాహుబలి వసూళ్ల స్థాయికి చేరుతున్న తొలి సినిమాగా ఖైదీ. నం. 150 రికార్డు నమోదు చేసింది.
అయితే ఏరియాల పరంగా చూస్తే నైజాంలో ఇది కాస్త వెనుకడుగు వేసింది కానీ ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో ఇది సంచలనాత్మక వసూళ్లు సాధించింది. అమెరికాలో మాత్రం 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు ఇంకాస్త దూరంలోనే ఉండటం గమనార్హం.