Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచి చేయాలనుకున్నపుడు ఎదురుదెబ్బలు సహజం : సోనుసూద్

మంచి చేయాలనుకున్నపుడు ఎదురుదెబ్బలు సహజం : సోనుసూద్
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:27 IST)
సాధారణంగా మంచి చేయాలన్నపుడు ఎదురు దెబ్బలు తగలడం సహజమని బాలీవుడ్ నటుడు సోనుసూద్ అన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరోగా కనిపించారు. అలాంటి సోనుసూద్ నివాసాలు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 
 
ఈ ఐటీ సోదాలపై సోనుసూద్ స్పందించారు. 'మనం ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది' నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట వింటున్నాను. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నవాడిలో నేనే మొదటివాడినని అనుకోవడం లేదు. ఐటీ అధికారులు మా ఇంటికి రాగానే.. సమాచారాన్ని అడిగి తెలుసుకుని దాడులు సక్రమంగా జరిగేందుకు వాళ్లకు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పాను. 
 
ఐటీ దాడులు జరగడానికి ముఖ్యమైన కారణమేమిటనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. కొంతమంది దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కలవడం వల్లే ఈ దాడులు జరిగాయంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. 
 
అయితే, అది రాజకీరపరమైన మీటింగ్‌ కాదని కేజ్రీవాల్‌తో భేటీ ముగిసినప్పుడే చెప్పాను. చిన్నారులందరూ చదువుకొనేలా చూడటమే నా ప్రధాన లక్ష్యమని చెప్పాను కూడా. ఇక, ఈ దాడుల నా అభిమానులు కొంతమేర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నన్ను తమ కుటుంబసభ్యుడిలా భావించారు’ అని సోనూసూద్‌ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్య - సమంత పెళ్లి పెటాకులా? భరణంగా రూ.300 కోట్లు???