ఆలియాతో బ్రేకప్‌కు ఇదే కారణమంట... సిద్ధార్థ్ ఏమన్నాడంటే?

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:43 IST)
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు. ఆ సినిమా షూటింగ్‌లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. బాలీవుడ్‌లో మోస్ట్ లవ్లీ కపుల్స్‌లో ఒకటైన ఈ జంట మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి వచ్చిన సిద్ధార్థ్ ఈ విషయం గురించి మాట్లాడారు.
 
కొన్ని వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వలనే తమ బ్రేకప్ జరిగిందని, అప్పటి నుండి ఒకరినొకరు కలుసుకోలేదని చెప్పిన సిద్ధార్థ్ మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు, ఒకరిపై మరొకరికి ద్వేషం లేదని స్పష్టం చేసారు. నా మొదటి సినిమాలోని మొదటి సన్నివేశం ఆలియాతోనే చిత్రీకరణ జరిగిందని, ఆ మధురానుభూతిని తాను ఎన్నటికీ మరువలేనని తలుచుకున్నారు.

ఆలియా మంచి నటిగా గుర్తింపు పొందుతోంది, కనుక తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకోవడం కూడా ఈ బ్రేకప్‌కు మరో మరొక ముఖ్యమైన కారణం. ఈ బ్రేకప్‌లో మా ఇద్దరిలో ఏ ఒక్కరి తప్పు లేదని, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
 
కానీ బ్రేకప్ తర్వాత చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యాను. చాలాకాలం ఆ ప్రభావం నాపై నుండి పోలేదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు సహజమని, అలాంటప్పుడు అక్కడితో ఆగిపోకుండా ముందుకెళ్లాలని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నానని తెలిపారు. బ్రేకప్ తర్వాత కూడా ఆలియా గురించి ఎంత మంచిగా చెప్పాడో సిద్ధార్థ్.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రానా మామూలోడు కాదు... హాలీవుడ్ ఆఫర్‌నే పెండింగ్‌లో పెట్టాడట...