Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫుల్లుగా మద్యం తాగాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త చుక్కేసుకోవడం అలవాటే.. కాని అది కొంప ముంచే అలవాటుగా ఉండకూడదు కదా. ఈ మర్మం తెలియని ఒక బాడీగార్డు ఉట్టిపుణ్యానికే ఉద్యో

ఫుల్లుగా మద్యం తాగాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?
హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (19:32 IST)
బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త చుక్కేసుకోవడం అలవాటే.. కాని అది కొంప ముంచే అలవాటుగా ఉండకూడదు కదా. ఈ మర్మం తెలియని ఒక బాడీగార్డు ఉట్టిపుణ్యానికే ఉద్యోగం ఊడగొట్టించుకున్నాడు. మలయాళ కుట్టి హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం తర్వాత డ్రైవర్లన్నా, అంగరక్షకులన్నా వణుకు పుడుతున్న తరుణంలో పుల్లుగా తాగడమే కాకుండా వాగినందుకు గాను అతగాడు ఉద్యోగం కోల్పోయాడు.
 
ఇటీవల మలయాళ నటి భావనను ఆమె డ్రైవరే కిడ్నాప్‌ చేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన విని భారతీయ చిత్రపరిశ్రమలో హీరోయిన్లు హడలి పోయారు. తమ కారు డ్రైవరే కాలయముడు అవుతాడన్న భయంతో చాలామంది హీరోయిన్లు రాత్రి పూట ప్రయాణాలంటేనే భయపడిపోయారు. అలాంటి తరుణంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ ఒక రాత్రి పూట అలాంటి చేదు అనుభవమే ఎదుర్కొంది. కానీ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రమాదం కొద్దిలో తప్పిపోయిందని తెలుస్తోంది. 
 
అలియా భట్‌కు అలాంటి చేదు అనుభవం ఎదురవడానికి కారణం ఆమె బాడీగార్డేనట. ఇటీవల సిద్ధార్త్‌ మల్హోత్రా ఇంటి నుంచి అర్ధరాత్రి తన ఇంటికి కారులో బయల్దేరిందట అలియా. కారులో వెనుక సీటులో అలియా పక్కన ఆమె బాడీగార్డ్‌ కూర్చున్నాడట. అయితే అతను ఆ సమయంలో విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడట. అతని వద్ద నుంచి మద్యం వాసన గుప్పుమని రావడంతో అతనికి దూరంగా జరిగి కూర్చుందట. 
 
అయినప్పటికీ అతను మద్యం మత్తులో ఏదో మాట్లాడుతుండడంతో ఆమెకు ముచ్చెమటలు పట్టాయట. ఆ సమయంలో అతనిపై ఆగ్రహం ప్రదర్శిస్తే తనకే ప్రమాదం అని గ్రహించి ఇంటికి వచ్చే వరకు ఊపిరి బిగబట్టుకుని కూర్చుందట. ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లి సోనీ రజ్దాన్‌కు చెప్పిందట. దీంతో ఆమె వెంటనే సదరు బాడీగార్డ్‌ను పనిలో నుంచి తీసేసిందట.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్‌‍కు మూడు సెటప్ రెఢీ... ఇక దున్నేయడమే ఆలస్యం...!