Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మురగదాస్ అంత చెత్త దర్శకుడా.. ప్రియదర్శన్ ఇలా పరువు తీశారేంటి?

ఆర్ట్ సినిమాలు, వాణిజ్య సినిమాలు అనే సరిహద్దు చెరిగిపోయిన కాలమిది. లేకపోతే బాహుబలి, రుస్తుం వంటి సినిమాలకు ఉత్తమ అవార్డులు రాగలవా? గతంలో సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, గోవింద్ నిహలానీ, ఆదూరు గోపాల కృష్ణన్ వంటి దార్శనికులకు అవార్డులు పంచిన జాతీయ చలన చిత్

Advertiesment
మురగదాస్ అంత చెత్త దర్శకుడా.. ప్రియదర్శన్ ఇలా పరువు తీశారేంటి?
హైదరాబాద్ , శనివారం, 15 ఏప్రియల్ 2017 (04:12 IST)
ఆర్ట్ సినిమాలు, వాణిజ్య సినిమాలు అనే సరిహద్దు చెరిగిపోయిన కాలమిది. లేకపోతే బాహుబలి, రుస్తుం వంటి సినిమాలకు ఉత్తమ అవార్డులు రాగలవా? గతంలో సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, గోవింద్ నిహలానీ, ఆదూరు గోపాల కృష్ణన్ వంటి దార్శనికులకు అవార్డులు పంచిన జాతీయ చలన చిత్ర పురస్కారాల ఎంపిక కమిటీ ఇప్పుడు వాణిజ్యపరమైన సినిమాలకే ఎక్కువగా అవార్డులు గుప్పిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రుస్తు చిత్రంలో నటించిన అక్షయ్ కుమార్‌ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిన జాతీయ చలనచిత్ర పురస్కారాల ఎంపిక జ్యూరీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ ఈ అవార్డుల ప్రదానంపై విరుచుకుపడ్డారు.
 
‘జ్యూరీలో ఉన్నవాళ్ల పక్షపాత స్వభావానికీ, ప్రభావానికీ జాతీయ అవార్డులు స్పష్టమైన నిదర్శనం. ఇవి పక్షపాతంతో కూడుకున్నవి అని ట్విట్టర్‌ వేదికగా మురగదాస్ వ్యాఖ్యానించారు. పైగా ఆదూర్‌ గోపాలకృష్ణన్ వంటి సుప్రసిద్ధ దర్శకుడే అవార్డుల ఎంపిక జ్యూరీని తప్పు పట్టారు. 2016లో విమర్శకుల ప్రశంసలు పొందిన పలు చిత్రాలకు మొండిచేయి ఎదురవగా, ‘రుస్తుం’ చిత్రానికి గాను అక్షయ్‌కుమార్‌ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియదర్శన్ ఆధ్వర్యంలోని జ్యూరీని దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ విమర్శించడం వాతావరణాన్ని వేడెక్కించింది. సహజంగానే మురుగదాస్‌ వ్యాఖ్యలు ప్రియదర్శన్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. ‘‘తన జీవితంలో కేవలం థర్డ్‌ రేట్‌ యాక్షన్ ఫిలిమ్స్‌ను మాత్రమే తీసిన డైరెక్టర్‌కు ఇంటలెక్చువల్‌ సినిమా గురించి మాట్లాడే హక్కు లేదు. నిజానికి ‘గజిని’ మినహా ఆయన తీసిన సినిమాలేవీ నేను చూడలేదు. అలాంటి వ్యక్తి మాటలకు విలువ ఉండదు’’ అని స్పందించారు. 
 
అయితే దీనికి మురుగదాస్‌ ఊరుకొనే రకం కాదు. ప్రియదర్శన్ స్పందనకు ఘాటుగానే ప్రతిస్పందించారు. ‘‘మిస్టర్‌ జ్యూరీ.. ఇది కేవలం నా గొంతు కాదు. ఇది మొత్తం భారతీయ ప్రేక్షకుల గొంతు. వాదించకుండా, నిజాన్ని తవ్వకుండా ఉంటే మంచిది’’ అని ట్వీట్‌ చేశారు. ఇలా రుస్తుంకు అవార్డు దక్కడంపై విమర్సలు చెలరేగుతుంటడంతో అక్షయ్ కుమార్ మహా ఇబ్బందిగా పీలవుతున్నారు. సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఒక సినిమా కోసం లేదా ఒక అవార్డ్‌ కోసం నాకు ఫేవర్‌ చేయమని ఎప్పుడూ అడగలేదు అని వాపోయారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ తేజ్ 'మిస్టర్' సినిమా రివ్యూ ... ప్రేక్షకులను తికమకపెట్టే స్పెయిన్ బుల్లోడు