ఎన్టీఆర్ ''బిగ్ బాస్''గా అదుర్స్ అనిపించాడు.. స్టార్ మా టీజర్ మీ కోసం..
టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంది. స్టార్ మా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ కనపడుతున్న లుక్ అదుర
టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంది. స్టార్ మా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ కనపడుతున్న లుక్ అదుర్స్ అనిపిస్తోంది. బ్లాక్ సూట్, కొత్త హెయిర్ స్టైల్‌తో ఎన్టీఆర్ అమితంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ టీజర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందించాడు.
అంతేకాదు ‘బిగ్ బాస్’ కోసం ఆయన సంగీతం దర్శకత్వంలోనే టైటిల్ సాంగ్ కూడా సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వెండితెరపై తిరుగు లేని స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్ కి బుల్లి తెరపై సందడి చేసే ఛాన్స్ ఇచ్చింది స్టార్ మా.
పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమా ఇచ్చిన బూస్టుతో వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఎన్టీఆర్‌కు స్టార్ డమ్‌ను ఏర్పరిచాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ అనే చిత్రాన్ని చేస్తుండగా తొలి సారి మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు.