బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 12వ వారంలో నిజంగానే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం అశ్విని శ్రీ హౌస్ నుంచి బయటికి వెళ్లింది. ఆదివారం ఎపిసోడ్‍లో రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో రతిక, అర్జున్ డేంజర్ జోన్‍లో నిలిచారు.
అయితే, ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు తన కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని పల్లవి ప్రశాంత్‍ను రతిక కోరారు. అయితే, ఇందుకు ప్రశాంత్ అంగీకరించలేదు. దీంతో రతిక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
ఎలిమినేట్ అయిన రతికను శివాజీ ఓదార్చారు. జీవితంలో ప్రతీ విషయానికి ఏడ్వడం లాంటివి చేయవద్దని శివాజీ చెప్పారు. బిగ్‍బాస్ స్టేజీపైకి వచ్చాక పాట పాడాలని రతికను నాగార్జున అడిగారు. దీంతో ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ రతిక పాట పాడారు.