బిగ్ బాస్ కంటిస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ తొలిసారి విమానం ఎక్కింది. బిగ్ బాస్ హౌజ్ సెటప్ చూసి షాకైన గంగవ్వ.. కొద్దిరోజులకే ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ప్రస్తుతం తొలిసారి ఫ్లైట్ ఎక్కింది. విమానంలో ఆమె హడావుడి చేసేసింది. శివరాత్రి సందర్భంగా ఫ్లైట్ ఎక్కిన గంగవ్వ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్లైట్ డోర్, కిటికీలు తెరవమని సిబ్బందికి చుక్కలు చూపించింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వేలల్లో లైకులు, వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు సంపాదించుకుంది.