Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్, ఆ విషయంలో అవినాష్ బాగా వీక్? (Video)

బిగ్ బాస్, ఆ విషయంలో అవినాష్ బాగా వీక్? (Video)
, బుధవారం, 14 అక్టోబరు 2020 (23:01 IST)
ప్రస్తుతం బిగ్ బాస్ షోలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వ్యక్తి ముక్కు అవినాష్. ఇతని పెర్ఫార్మెన్సును చూస్తున్న వారు చాలాకాలం హౌస్‌లో ఉంటారని చెబుతున్నారు. ఫర్ఫెక్ట్‌గా గేమ్ ఆడుతూ.. అందరినీ నవ్విస్తూ దూసుకుపోతున్నాడు. కానీ ఒక్కోసారి అమ్మాయిల వ్యవహారంలో అతను వ్యవహరిస్తున్న తీరు బాగా వీక్ అవుతోందన్న ప్రచారం బాగానే సాగుతోంది.
 
హౌస్‌లో అందరినీ నవ్విస్తూ కమెడియన్‌గా ముక్కు అవినాష్ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అరియానాపై తన ఫోకస్ పెట్టాడు. ఆమెకు మేకప్ వేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. నేను లేకపోతే నువ్వు లేవు అంటూ భారీ డైలాగ్‌లతో దగ్గరవుతున్నాడు.
 
ప్రస్తుతానికి వీరి వ్యవహారం పక్కనబెడితే హాట్ టాపిక్ మొత్తం దివితోనే. అయితే దివి చాలామందిని కించపరిచేలా మాట్లాడడం అలవాటుగా చేసుకొన్నట్లుంది. అవినాష్ నువ్వు కామెడీ పీస్ అంటూ హేళనగా మాట్లాడడం ఇప్పుడు హౌస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
అయితే దివి మాటలకు హర్టయిన అవినాష్ చికెన్ పీస్, ఫిష్ పీస్ లాగా కామెడీ పీస్ ఏంటి దివి... కమెడియన్ అని చెప్పు. హుందాగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కవర్ చేశాడు కానీ దివిని కూడా మనోడు లవ్‌లో పెడుతున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఆమె ఇప్పటికీ ఎవరితోను ప్రేమలో పడలేదు కాబట్టి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు సచిన్‌ జోషి అరెస్ట్, గుట్కా అక్రమ రవాణా చేస్తున్నారనీ...