బిగ్ బాస్-7 నుంచి తాజా ప్రోమో రిలీజైంది. ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే సభ్యులను స్వయంగా బిగ్‌బాస్ సెలక్ట్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఎవిక్షన్ పాస్‌ను సొంతం చేసుకునేందుకు కేవలం ఒకరితో కాదు.. ఇద్దరితో డిఫైండ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్.
ఇక ఇందుకు శివాజీ, ప్రియాంక టాస్కులో యావర్‌తో తలపడ్డారు. ఈ టాస్కుకు ప్రశాంత్, శోభా సంచాలక్‌గా వ్యవహరించారు. ఇక ఈ టాస్కులో ముందుగా ప్రియాంక బాల్స్ బ్యాలెన్స్ చేయలేకపోయింది. దీంతో ఆమె గేమ్ నుంచి తప్పుకుంది.
ఇక ఆ తర్వాత శివాజీ తన బాల్స్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. బాల్స్ పడిపోవడంతో.. వెంటనే సీరియస్ అయ్యాడు శివాజీ. ఎక్కువగా డిస్ట్రబెన్స్‌గా ఉంది నీది అంటూ సీరియస్ కాగా.. మమ్మల్ని చూడకుండా బాల్స్‌పై దృష్టి పెట్టాలని చెప్పాడు ప్రశాంత్.
టాస్క్ ఫలితం చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. శివన్న ఎక్కువసేపు బాల్ పట్టుకున్నారు. అందుకే ఆయనను అవుట్ చేశామంటూ శోభా చెప్పడంతో నీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకో అంటూ లేచీ వెళ్లిపోయాడు శివాజీ.
మీరు ఇలాంటి రాంగ్ ప్రోటేట్ చేయొద్దు అంటూ అరిచింది శోభా. దీంతో నీకంటే ఎక్కువ అరుస్తా అరవలేనా?.. ఎందుకు అరుస్తున్నావ్ అంటూ శివాజీ సీరియస్ కావడంతో ప్రోమో ముగిసింది.
మరోవైపు బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్‌లో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఒంట్లో బాగోలేదని.. పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోందని అంకిత లోఖండే భర్త విక్కీతో వాపోయింది.
అలాగే మెడికల్ రూమ్‌లో ప్రెగ్నెన్సీ టెస్టులు జరిగాయని చెప్పింది. కానీ రిజల్ట్ మాత్రం చెప్పలేదని అంకిత వెల్లడించింది. ఒక వేళ పాజిటివ్ ఫలితాలు వస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో పేరెంట్స్ అయిన జంటగా ఈ దంపతులు చరిత్రలో నిలిచిపోతారు.