Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ 16వ సీజన్‌... టీనాపై సల్మాన్ ఫైర్.. ప్రేమలో పడలేమన్న కంటిస్టెంట్..

Advertiesment
BB 16
, శుక్రవారం, 6 జనవరి 2023 (13:20 IST)
BB 16
బిగ్ బాస్ 16వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. సల్మాన్ ఖాన్ కంటిస్టెంట్లు టీనా దత్తా, షాలిన్ భానోట్‌లను దూషించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వారి సంబంధాన్ని ఫేక్ అని సల్మాన్ పిలిచారు. 
 
గత వారం బిగ్ బాస్ 16 హౌస్‌లో అనేక పోరాటాలు, గందరగోళ క్షణాలతో నిండిపోయింది. టీనా దత్తా, షాలిన్ భానోట్‌ల మధ్య అసలు ఏమి జరుగుతోందనే దాని గురించి హౌస్‌మేట్‌లు అయోమయంలో పడ్డారు, వారు స్నేహితులా, స్నేహితుల కంటే ఎక్కువ రిలేషన్‌లో వున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
శుక్రవారం నాటి షోలో సల్మాన్ ఖాన్ టీనాను ఏకి పారేశారు. టీనాను సల్మాన్ ఇలా అడిగాడు, "టీనా, నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు. ఎవరితో ఆడుతున్నావు? ఈ ప్రశ్నకు టీనా అయోమయంలో పడింది. "సార్ నేను నటించను, మనం కలిసి ఉండలేమని షాలిన్‌కి కూడా చెప్పాను." అంటూ చెప్పింది. 
 
అందుకు సల్మాన్ "నీ ఆటలో స్థిరత్వం లేదు, బలహీనంగా వున్నప్పుడు అతని వెంట.. బలంగా ఉన్నప్పుడు మీరు అతన్ని విడిచిపెట్టారు." అంటూ వెల్లడించాడు.
 
ఇందుకు టీనా స్పందిస్తూ.. "మేము ప్రేమలో పడలేం," అంటూ పేర్కొంది. కచేరీ రాత్రిలో షాలిన్-టీనా డ్యాన్స్ చేస్తున్న తీరును చూపించడానికి సల్మాన్ సంజ్ఞ చేసాడు. దీంతో టీనా- షాలిన్ ఇబ్బంది పడ్డారు. కానీ షాలిన్ జోక్యం చేసుకుని సార్ ఆమె పట్ల కఠినంగా వ్యవహరించకండి అంటూ అడిగాడు. ఇంకా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటి సంభాషణతో తాజా ఎపిసోడ్ కొనసాగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ధమాకా' దూడుకు... రూ.100 కోట్ల క్లబ్‌లో రవితేజ చిత్రం