భారతీయులు ముద్దులు పెట్టుకోరు.. బూతులు మాట్లాడరు.. బిదిత ఎద్దేవా
కామెడీ, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన "బాబూమోషై బందూక్ బాజ్" సినిమా పట్ల సెన్సార్ వ్యవహరిస్తున్న తీరుపై నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 48 కట్స్ ఇచ్చింది. సెన్సార్ కట్స
కామెడీ, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన "బాబూమోషై బందూక్ బాజ్" సినిమా పట్ల సెన్సార్ వ్యవహరిస్తున్న తీరుపై నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 48 కట్స్ ఇచ్చింది. సెన్సార్ కట్స్‌తో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి నవాజుద్ధీన్ సిద్ధికీ సెన్సార్‌పై నిప్పులు చెరిగారు.
అలాగే సిద్ధికీకి జంటగా నటించిన బిదిత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సార్ తీరుపై సెటైర్లు వేస్తూ పోస్ట్ చేసింది. అంతేగాకుండా భారతీయులు ముద్దులు పెట్టుకోరని... బూతులు మాట్లాడరంది. ఇంకా తన పోస్టుకు సంస్కారి, సీబీఎఫీసీ అనే హ్యాష్ ట్యాగులు కూడా జోడించింది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే... బాబూమోషై బందూక్ బాజ్ సినిమాకు సెన్సార్ కట్స్‌తో కొన్ని సీన్లను రీషూట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఇన్ని కట్స్‌తో సినిమాను ఎలా విడుదల చేస్తామని యూనిట్ వాపోతోంది. సెన్సార్ మాత్రం నిబంధనల మేరకే కట్స్ ఇచ్చామని అంటున్నా.. సినీ యూనిట్ న్యాయపోరాటం కోసం కోర్టు కెళ్లాలని భావిస్తోంది.