Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్పీ రేటింగ్‌లోనూ అదరగొట్టిన ''బిచ్చగాడు''.. దక్షిణాదిలోనే నెం.1.. బాహుబలి కూడా వెనక్కి?

విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా పిచ్చైక్కారన్ తెలుగులో బిచ్చగాడుగా డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోటి రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని తెలుగు డబ్బింగ్ సినిమాగా వచ్చినా, కలెక్షన్లప

Advertiesment
టీఆర్పీ రేటింగ్‌లోనూ అదరగొట్టిన ''బిచ్చగాడు''.. దక్షిణాదిలోనే నెం.1.. బాహుబలి కూడా వెనక్కి?
, శనివారం, 26 నవంబరు 2016 (13:26 IST)
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా పిచ్చైక్కారన్ తెలుగులో బిచ్చగాడుగా డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోటి రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని తెలుగు డబ్బింగ్ సినిమాగా వచ్చినా, కలెక్షన్లపరంగా రికార్డు సృష్టించింది. తెలుగులో డబ్బింగ్ సినిమాలు వసూలు చేయలేని భారీ వసూళ్లను గడించిన  బిచ్చగాడు సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఫలితంగా కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా వెండితెరపై టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. కేవలం వెండితెర మీదే కాదు బుల్లితెరపై కూడా బిచ్చగాడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 
 
ఇటీవల ఓ తెలుగు టీవీ ఛానల్‌లో ప్రసారం అయిన బిచ్చగాడు టీఆర్పీ రేటింగ్‌లో 18.75 పాయింట్లు సాధించాడు. తద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను వెనక్కి నెట్టాడు. తాజాగా బిచ్చగాడు తమిళ వెర్షన్ టీఆర్పీ రికార్డులో అదరగొట్టింది. దక్షిణ భారత దేశంలోనే నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవ ఓ తమిళ ఛానల్‌లో ప్రసారం అయిన పిచ్చైకారన్ 24.55 టీఆర్పీ రేటింగ్‌తో సంచలనం సృష్టించింది. తద్వారా అగ్రహీరోలు రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటు, బాహుబలి టీఆర్పీలను కూడా వెనక్కి నెట్టి బిచ్చగాడు సంచలనం సృష్టించాడు.
 
ఇదిలా ఉంటే.. విజయ్ ఆంటోనీ తదుపరి సినిమా బేతాళుడు డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ‘మానస్ రిషి ఎంటర్ ప్రైజస్’ సంస్థతో కలసి బేతాళుడు సినిమాను తెలుగునాట తమ ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే లీకైన పదినిమిషాల ''బేతాళుడు'' వీడియోకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముస్తాఫా రాజాతో ప్రియమణి పెళ్ళి వాయిదా? ఇంతలో తరుణ్‌తో ప్రియమణి పెళ్ళి ఫిక్సయిందా?