Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కగా మారిన భూమిక

హీరోయిన్లు అక్కగా మారడం సహజమే.. పెళ్ళయ్యాక నటిగా విరామం ఇచ్చిన భూమిక ఆడపాదడపా చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం కథ నచ్చి అక్కగా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో వచ్చిన 'ఎమ్‌ ఎస్‌ ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'లో ఆమె ధోనికి అక్కగా

Advertiesment
Bhumika chawla acting as sister to nani
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (19:27 IST)
హీరోయిన్లు అక్కగా మారడం సహజమే.. పెళ్ళయ్యాక నటిగా విరామం ఇచ్చిన భూమిక ఆడపాదడపా చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం  కథ నచ్చి అక్కగా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో వచ్చిన 'ఎమ్‌ ఎస్‌ ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'లో ఆమె ధోనికి అక్కగా నటించింది. 
 
తాజాగా దిల్‌ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని అక్క పాత్ర కోసం భూమికను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వల్లనే ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమాకి భూమిక ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్ అనసూయ యాక్టింగ్... యాంకర్ సుమ సింగింగ్... 'విన్నర్' చిత్రంలో...