Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భరతనాట్యం రెండో పాట విడుదల

Suryateja Ele, Viva Harsha
, గురువారం, 28 డిశెంబరు 2023 (15:34 IST)
Suryateja Ele, Viva Harsha
దొరసాని ఫేమ్ కే వీ ఆర్ మహేంద్ర దర్శకత్వంలో పీ ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్న చిత్రం భరతనాట్యం. “సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్” అనేది క్యాప్షన్. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభించింది. అదే ఊపులో ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు. వివేక్ సాగర్ మ్యూజిక్ చేసిన ఈ పాటను ఆంథోనీ దాసన్ తన విలక్షణ శైలీలో పాడారు.

ఇందులో సినిమా దర్శకుడు అవ్వాలనుకునే కథానాయకుడికి ఎదురైన ఇబ్బందులు, దురదృష్టానికి చిహ్నంగా ఉన్న అతని పరిస్థితులను రచయిత అనంత శ్రీరామ్ తనదైన విలక్షణమైన శైలీలో “ఎట్టరో.. ఎట్టెట్ట ఎట్టరో… నీ ఉల్టా జాతకo మారేది ఎట్ట... తలరాతలు రాసే వానికే తల తిరిగే కథ నీది.. విధి రాతలు మార్చిన వానినే విసిగించే ధశ నీది” అంటూ రాశారు. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్ తో యూత్ ఫుల్ గా సాగే ఈ పాట అందరినీ అలరిస్తుంది. మేకర్స్ త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
నటీనటులు: సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శివన్నారాయణ, సలీం ఫేకు, గంగవ్వ, టెంపర్ వంశీ, సంతోష్ బాలకృష్ణ, కృష్ణుడు, సత్తన, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి తదితరులు.
 
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం- కే వీ ఆర్ మహేంద్ర, నిర్మాత - పాయల్ సరాఫ్, స్టోరీ- సూర్యతేజ ఏలే, స్క్రీన్ ప్లే మరియూ మాటలు- సూర్యతేజ ఏలే, కే వీ ఆర్ మహేంద్ర, సంగీతం- వివేక్ సాగర్, ఎడిటర్- రవితేజ గిరిజాల, కెమెరా- వెంకట్ ఆర్ శాకమూరి, ఆర్ట్- బేబీ సురేష్ భీమగాని, సాహిత్యం- భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, పబ్లిసిటీ డిజైన్స్- దని ఏలే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ బోనాలు నేపథ్యంలో పొట్టేల్ ఫస్ట్ ఇంపాక్ట్