Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''కంచె''కు మరో పురస్కారం.. భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా...

భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా కంచె ఎంపికైంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్ర

Advertiesment
bharat muni award goes to Kanche Tollywood movie
, ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (14:22 IST)
భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా కంచె ఎంపికైంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్రకటించారు. 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గానికి అవార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
ఉత్తమ చిత్రంగా కంచె, సందేశాత్మకచిత్రం దాగుడుమూతలు, హాస్య చిత్రం భలేభలే మగాడివోయ్, చారిత్రాత్మకచిత్రం రుద్రమదేవి, ప్రజాదరణ చిత్రం బాహుబలి, ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంసానటుడు వరుణ్‌తేజ్, నటి అనుష్క, విలన్‌గా తనికెళ్ల భరణి ఎంపికయ్యారు. వివిధ కేటగిరీల్లో కూడా అవార్డులను  ప్రకటించారు.
 
కాగా.. కంచె 2015 అక్టోబరు 22న విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతోంది. ఇప్పటికే కంచె సినిమా 63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, నిఖిత్ ధీర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి జాగర్లమూడి రాధాకృష్ణ క్రిష్ దర్శకత్వం వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే సినిమాలు చేయట్లేదు.. సౌత్ సినిమాలపై సమంత సెన్సేషనల్ కామెంట్స్