Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలకేయ ప్రభాకర్ ఇప్పుడెక్కడున్నారు.. ఒక్క సినిమాతోనే వైభవం ముగిసిపోయిందా...?

మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డి పాత్ర గుర్తుందా.. సినిమాలంటే ఓనమాలు తెలియని ఒక తెలంగాణ కుర్రాడిని కనకాల దేవదాస్ దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా మర్యాద రామన్న చిత్రంలో బలమైన విలన్‌కి ప్రతిరూపంలా నిలిపి నటింపచేసి రాజమౌళి తన ఒకే ఒక్క సినిమాతో ఎక్కడికో త

కాలకేయ ప్రభాకర్ ఇప్పుడెక్కడున్నారు.. ఒక్క సినిమాతోనే వైభవం ముగిసిపోయిందా...?
హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (05:27 IST)
మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డి పాత్ర గుర్తుందా.. సినిమాలంటే ఓనమాలు తెలియని ఒక తెలంగాణ కుర్రాడిని కనకాల దేవదాస్ దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా మర్యాద రామన్న చిత్రంలో బలమైన విలన్‌కి ప్రతిరూపంలా నిలిపి నటింపచేసి రాజమౌళి తన ఒకే ఒక్క సినిమాతో ఎక్కడికో తీసుకుపోయాడు. తెలంగాణ కుర్రాడు రాయలసీమ రౌద్రాన్ని, కసిని, ప్రతీకారాన్ని తన కళ్లల్లో చూపించి అదరగొట్టిన ఆ మేటి విలన్ పేరు ప్రభాకర్. 
 
కానీ వట్టి ప్రభాకర్ అంటే ఇప్పుడు ఎవరికీ అర్థం కాదేమో మరి. అవును అతడిప్పుడు కాలకేయ ప్రభాకర్. భారతీయ వెండితెర అద్భుతం బాహుబలి సినిమాలో నల్లరాతి కొండలాంటి దృఢమైన శరీరం, చింత నిప్పులాంటి కళ్లు...ఈ భయానక ఆహార్యానికి తోడు భయంకరమైన కంఠంతో వెన్నులో చలి పుట్టించాడు కాలకేయుడు. ప్రభాకర్‌’ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, ‘కాలకేయుడు’ అనే పేరు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు తెలుసు! ‘బాహుబలి’లో బాహుబలి, భల్లాలదేవలు ఎలా గుర్తుండి పోతారో కాలకేయుడు కూడా అలాగే గుర్తుండి పోతాడు. అతడు మాట్లాడిన ‘కిలికి’ భాష కూడా అలాగే గుర్తుండి పోతుంది. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ కాలకేయగా చూడాలంటే కూడా భయపడేంత భీకర నటనను ప్రదర్శించాడు. కాని చిత్రసీమలో అతనంత సిగ్గరి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి అనుకోకుండా మగధీర సినిమాకోసం నటులను వెతుకుతున్న రాజమౌళి కంట్లో పడ్డాడు. మగధీర షూటింగ్ పూర్తయ్యాక మర్యాద రామన్న సినిమాలో ఒక వేషం ఇస్తున్నట్లు రాజమౌళి చెప్పిన క్షణం ప్రభాకర్ జీవిత గమనాన్నే మార్చివేసింది. ఆ సినిమాలో వేసిన బైరెడ్డి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 
 
ఇక ‘బహుబలి’ సినిమాలో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్‌ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఈ సినిమాలో ఉపయోగించిన ‘కిలికి’ భాష కోసం రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్‌ చేసేవాడు ప్రభాకర్‌. ఇది మాత్రమే కాదు... కాలకేయుడిగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృథా పోలేదు... అని కాలకేయుడి పాత్రకు వచ్చిన స్పందన చెప్పకనే చెప్పింది.
 
కాలకేయుడి పాత్రలో నటించి యావద్భారతాన్ని, ప్రపంచ చలన చిత్ర పరిశ్రమను కూడా మెప్పించిన ప్రభాకర్ బాహుబలి-2 సినిమా ప్రమోషన్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మళ్లీ రాజమౌళి పూనుకుని బలమైన పాత్రను ఇస్తే తప్ప ప్రభాకర్‌కు మద్దతు నిచ్చే వారు తెలుగు చిత్ర పరిశ్రమలో లేకపోవడం విషాదం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగోసారి.. ఐశ్వర్యారాయ్‌తో మణిరత్నం కొత్త సినిమా