Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐశ్వర్యరాయ్‌కు అవార్డు...

నటి ఐశ్వర్యరాయ్‌కు లయన్స్‌ గోల్డ్‌ అవార్డు దక్కింది. 'సరబ్‌జిత్‌' చిత్రంలోని ఆమె నటించిన పాత్రకు ఉత్తమ నటిగా లభించింది. బుధవారం ముంబయి శివారులోని ఓ ఆడిటోరియంలో లయన్స్‌ గోల్డ్‌ అవార్డుల వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌, రాజకీయ ప్రముఖు

Advertiesment
Best Actress award to Aishwarya Rai
, గురువారం, 5 జనవరి 2017 (20:46 IST)
నటి ఐశ్వర్యరాయ్‌కు లయన్స్‌ గోల్డ్‌ అవార్డు దక్కింది. 'సరబ్‌జిత్‌' చిత్రంలోని ఆమె నటించిన పాత్రకు ఉత్తమ నటిగా లభించింది. బుధవారం ముంబయి శివారులోని ఓ ఆడిటోరియంలో లయన్స్‌ గోల్డ్‌ అవార్డుల వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ సతీమణి అమతా ఫడణవిస్‌ ఐశ్వర్యరాయ్‌కు అవార్డు ప్రదానం చేశారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన 'సరబ్‌జిత్‌' చిత్రంలో ఐశ్వర్యరాయ్‌తో పాటు రణ్‌దీప్‌ హుడా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించారు. గత ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగిల్ కట్ లేకుండా శాతకర్ణి సెన్సార్... బాలయ్య నటన అదుర్స్ అంటూ సెన్సార్ సభ్యులు పొగడ్తలు...