Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాక్సింగ్ నేపథ్యంలో KNOCK OUT చిత్రం ప్రారంభం

Advertiesment
Knockout
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:39 IST)
MSN Reddy, Mahidhar, Sai Rajesh and ohters
బన్నీ, భగీరథ, ఢీ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి గారి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం "KNOCK OUT.. ఈ చిత్రం ద్వారా మహీధర్  హీరోగా, ఉదయ్ కిరణ్ ను దర్శకుడు గా  పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర సినీ, ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకుడు సాయి రాజేష్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.చిత్ర దర్శకుడు ఉదయ్ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం చిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) మాట్లాడుతూ, ఈ చిత్రం ఆద్యంతం బాక్సింగ్ మీద ఉంటుంది. ఇందులో వుండే ఏడు ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ చేత కంపోజ్ చేయించడం జరిగింది. ప్రముఖ ఛాయా దర్శకుని వద్ద పనిచేసిన జీ.వి. ప్రసాద్ కెమెరామెన్‌గా చేయనున్నారు.  మిగిలిన తారాగణం టెక్నీషియన్స్ ఎంపిక చేసి, మార్చి మొదటి వారం నుండి నిర్విరామంగా షూటింగ్ చేసుకొని 60 రోజులలో ఈ చిత్రం పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 
 
చిత్ర దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ,  మార్షల్ ఆర్జిస్ట్ తన లైఫ్ లో ప్రతి ఫేస్ లో ఎదురయ్యే క‌ష్టాల‌ను ఎలా ఎదుర్కొంటాడు. అలా ఎదుర్కొనే క్ర‌మంలో తనేం కోల్పోతాడు. తను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యాడా.. లేదా..అనేదే కథ. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం  భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్, వైజాక్, అరకు  తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకొని సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
 
చిత్ర హీరో మహీధర్ మాట్లాడుతూ, బాక్సింగ్‌లో ఓ భాగ‌మైన M.M.A బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రమిది. ఫుల్ యాక్షన్ మూవీ ఇది.ఈ చిత్రం కొరకు నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రీతనయులు నటించిన "మహాన్" ట్రైలర్ రిలీజ్