బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణలో ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. చీరల్లో క్వాలిటీ లేదని.. చిరిగినవి వస్తున్నాయని.. కొన్ని చీరలకు ప్రింట్ సరిగా లేకపోవడం మరికొన్నింటికి నూలు దారాలు క్రమపద్ధతిలో రాకుండా ఉండడం. మరికొన్ని చీరలకు చిన్న చిన్న రంధ్రాలు ఉండడంవల్ల మహిళలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బతుకమ్మ చీరలు ఇచ్చినవి తీసుకొని వెళ్లాల్సిందే. వేరే కావాలని అడిగినా ఇవ్వరు. దెబ్బతిని వచ్చిన చీరల పరిస్థితి ఏంటని మహిళలు అంటున్నారు. ఇంటికి వెళ్ళిన మాత్రమే చీరలను ఓపెన్ చేసి చూసుకొంటున్నామని తేడా వచ్చినా చప్పుడు చేయకుండా ఉండాల్సిన వస్తుందని మహిళలు అంటున్నారు.
మళ్లీ అడిగితే ఫ్రీ గా వచ్చిన చీరలే కదా ఎలా వస్తే ఏంటి అని అంటున్నారని వారు తెలుపుతున్నారు. ఫ్రీగా రావడం ఏంటి మనం కట్టిన పన్నులు మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే కదా ! వాటికి విలువ లేదా అని పలువురు మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వీటికి సమాధానం ఎక్కడ రెవెన్యూ వారిని అడిగిన వారు కూడా ఎలాంటి సమాచారం వారి వద్ద లేదు.
మనం ఆన్ లైన్ లో మార్కెటింగ్ చేసిన వాటికి సహితం నచ్చకపోతే వాపస్ చేసి నచ్చినది మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా డబ్బులు మన ఖాతాలో జమ చేసుకోవచ్చు అలాంటి అవకాశాలు ఉన్న ఈ రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో దెబ్బతినే వాటికి రీప్లేస్ మేట్ లేకుండా ఉండడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక మండలంలో మరో సమస్య ఏంటంటే కొందరు మహిళలకు ఆధార్ కార్డు ఉంది వయసు కూడా 18 సంవత్సరాలు పైబడి ఉన్నారు మరి కొందరు వృద్ధులు కూడా ఉన్నారు వీరికి ప్రభుత్వ రేషన్ షాపుల్లో రేషన్ కూడా లభిస్తుంది కానీ బతుకమ్మ చీరల పంపిణీ లో వారి పేరు రాలేదు. దీనికి కూడా అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు.