24న ఫ్యాక్షన్ ప్రేమకథా చిత్రం 'బాలకృష్ణుడు' రిలీజ్
నారా రోహిత్ బాలకృష్ణుడిగా నటిస్తున్న చిత్రం "బాలకృష్ణుడు". ఈ చిత్రంల ఈనెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నారా రోహీతో మరోమారు ప్రే
నారా రోహిత్ బాలకృష్ణుడిగా నటిస్తున్న చిత్రం "బాలకృష్ణుడు". ఈ చిత్రంల ఈనెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నారా రోహీతో మరోమారు ప్రేక్షకులను ఆలరించేందుకు ముందుకు వస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన 'శమంతకమణి' ఫర్వాలేదనిపించింది. ఇపుడు 'బాలకృష్ణుడు'గా ముందుకురానున్నాడు.
పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించింది. హైదరాబాద్ - కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా ఈ సినిమా కొనసాగుతుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.