Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయం కోసం ఆఖరి రుద్రాభిషేకం... బాలకృష్ణ పూజలు...

శాతవాహన చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' పై జీవిత చరిత్రపై సినిమా చేయడం అది విజయవంతం కావడం కోసం ఆల్‌ ఇండియా ఎన్‌.బి.కె.ఫ్యాన్స్‌ భారతదేశంలో 1116 శివాలయాల్లో మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం సోమవారం ఫిలింనగర్‌ దైవసన్నిధానమ

విజయం కోసం ఆఖరి రుద్రాభిషేకం... బాలకృష్ణ పూజలు...
, సోమవారం, 28 నవంబరు 2016 (21:54 IST)
శాతవాహన చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' పై జీవిత చరిత్రపై సినిమా చేయడం అది విజయవంతం కావడం కోసం ఆల్‌ ఇండియా ఎన్‌.బి.కె.ఫ్యాన్స్‌ భారతదేశంలో 1116 శివాలయాల్లో మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం సోమవారం ఫిలింనగర్‌ దైవసన్నిధానమ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్‌, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
 
బాలకృష్ణ మాట్లాడతూ.. చిత్ర విజయవంతం కోసం నందమూరి అభిమానులు ఫిలిం దైవ సన్నిధానంలో మహారుద్రాభిషేకం చేయడం ఆనందంగా ఉంది. ఈ బృహత్‌ కార్యక్రమం ఇలా చేయడం దైవసంకల్పంగా భావిస్తున్నాం. తెలుగు ప్రజల గొప్పతనాన్ని తెలియజేసిన చక్రవర్తి గౌతమిపుత్రుని గురించిన చరిత్ర అతి తక్కువగా ఉంది. అటువంటి చరిత్రను సినిమా తెరకెక్కించడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. 
 
గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారు కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల ప్రాంతంలో జన్మించారు. ఆమె తనయుడైన శాతకర్ణి భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. అలా మనకు ఓ వారసత్వాన్నిచ్చిన వీర గాథ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి వారసుడిగా ఇంత గొప్ప సినిమాను చేయడం నా అదృష్టంగా, దైవేచ్చగా భావిస్తున్నాను. సినిమాను దర్శకుడు క్రిష్‌... మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. నటీనటుందరి వద్ద దర్శకుడు మంచి నటనను రాబట్టుకున్నారు. డిసెంబర్‌ 16న ఆడియో విడుదల చేస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజలు చేస్తున్న పూరీ బ్రదర్స్... ఎందుకంటే...?