డిజిటల్ మీడియా హావా నడుస్తున్న టైములో ఆహ! అనే కొత్త ఓ.టి.టి. వచ్చింది. పలు ప్రోగ్రామ్స్ చేసింది. గేమ్ షో కు చేసింది. ఓ.టి.టి. సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ పెద్ద ఫామ్ లేని టైములో బాలకృష్ణ హోస్టుగా ఆన్ స్టాపబుల్ ప్రోగ్రామ్స్ తో రేటింగ్ పెరిగింది. ఇక ఆ తరువాత సరికొత్త ప్రోగ్రామ్లు లేక పోటీలో వెనుకపడి పోయింది. అసలు బాలయ్య లేకపోతే ఆహా! అంతే సంగతులు అనే టాక్ ఇండస్ట్రీ లో నెలకొంది. ఇప్పుడు మరో సారి ఆయనతో ప్రోగ్రామ్ చేయాలని చూస్తుంటే సాధ్యపడదని చెప్ప్పినట్లు తెలుస్తోంది.
దానికి ఇన్నర్ గా ఈ కొత్త డిజిటల్ మీడియా కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా జీతాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు పలు పేర్లతో కొత్త ఫ్లాట్ ఫారం లు వస్తున్నాయి. ఏవి సరిగాలేవు. పెద్ద వారు ఇందులో పెట్టుబడి పెట్టారు. అర్హా మీడియా & బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని భారతీయ ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ సేవ. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది తెలుగు భాష కంటెంట్‌ను అందిస్తుంది. మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్.