Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోయపాటికి బాలకృష్ణ హెచ్చరిక... వార్నింగ్ వెనుక థ్రిల్లింగ్ విషయం!

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు యువరత్న బాలకృష్ణ గట్టిగా ఓ హెచ్చరిక చేశారు. ఈ వార్నింగ్ వెనుక ఓ ఆసక్తికర అంశం దాగివుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. బాలకృష్ణ కృష్ణవంశీ కాంబినేషన్

Advertiesment
Balakrishna
, సోమవారం, 28 నవంబరు 2016 (16:11 IST)
టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు యువరత్న బాలకృష్ణ గట్టిగా ఓ హెచ్చరిక చేశారు. ఈ వార్నింగ్ వెనుక ఓ ఆసక్తికర అంశం దాగివుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. బాలకృష్ణ కృష్ణవంశీ కాంబినేషన్‌లో "రైతు" అనే చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కానీ, ఈ చిత్రం వాయిదా పడింది. మరి ఆ స్థానంలో రావాల్సిన సినిమా ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో రానుంది. ఇది బాలకృష్ణ అభిమానులకి థ్రిల్లింగ్ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ప్రస్తుతం బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నాడు. వాస్తవానికి బాలయ్య తన వందో చిత్రాన్ని బోయపాటితో చేస్తాడు అనుకున్నారు. కానీ, క్రిష్ 'గౌతమీపుత్ర' వంటి చారిత్రక కథతో రావడంతో అటువైపు బాలయ్య మొగ్గు చూపాడు. దీంతో 101వ సినిమా అన్న బోయపాటితో చేస్తాడు అనుకుంటే కృష్ణవంశీ ఆ సినిమాను బుక్ చేసుకున్నాడు. అయితే, ప్రస్తుతం కృష్ణవంశీ చేస్తున్న 'నక్షత్రం' పూర్తవడానికి చాలా ఆలస్యం అవుతుందట. అప్పటివరకు ఆగలేని బాలయ్య.. బోయపాటికి ఫోన్ చేసి.. తన తర్వాతి సినిమాకు కథను సిద్ధం చేయమన్నాడట. 
 
ఇంకేముంది బోయపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్న బోయపాటి.. త్వరత్వరగా పూర్తి చేసి బాలయ్య కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు ఘన విజయాలు సాధించిన విషయం తెల్సిందే. ఈ కొత్త ప్రాజెక్టు కూడా అలాంటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్‌ బాబును చూసేందుకు తహతహ... అహ్మదాబాదులో... ప్రిన్స్ అంటే ఏమనుకుంటున్నారు..?