ఎన్టీఆర్ బయోపిక్‌లో వివిధ గెటప్‌లతో నందమూరి హీరో బాలకృష్ణ అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నుంచి వేంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య గెటప్‌ను తాజాగా సినీ యూనిట్ విడుదల చేసింది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని కథానాయకుడు సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు రామారావు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఎన్టీఆర్.. మహానాయకుడుగా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మరోరెండు రోజుల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నుంచి వెంకన్న రూపంలో వున్న బాలయ్య గెటప్‌ను విడుదల చేశారు. దాదాపు 6 దశాబ్దాల క్రిందట వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహాత్య్యం సినిమాలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి వేషంతో జనాల మదిని దోచుకున్న సంగతి తెలిసిందే.