Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విఎఫ్‌ఎక్స్‌ పనుల్లో 'బాహుబలి 2'... ఏప్రిల్ 28న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్

'బాహుబలి 2' పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు చురుగ్గాసాగుతున్నాయి. ఈ చిత్రంపై ప్రతివారికి ఇంట్రెస్ట్‌ కలిగింది. దాన్ని దర్శకుడు రాజమౌళి అనుకూలంగా మార్చుకుంటూ విడుదల తేదీని ప్రకటించకుండా దాట వేస్తున్నాడు.

Advertiesment
Bahubali 2 in VFX works
, శుక్రవారం, 3 మార్చి 2017 (16:11 IST)
'బాహుబలి 2' పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు చురుగ్గాసాగుతున్నాయి. ఈ చిత్రంపై ప్రతివారికి ఇంట్రెస్ట్‌ కలిగింది. దాన్ని దర్శకుడు రాజమౌళి అనుకూలంగా మార్చుకుంటూ విడుదల తేదీని ప్రకటించకుండా దాట వేస్తున్నాడు. అయితే ముందుగా అందరికీ తెలిసినట్లుగా ఏప్రిల్‌ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేస్తున్నట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి. శివరాత్రి నుంచి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ఆరంభమయ్యాయి. 
 
ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ముందుగా రిలీజ్‌ చేయబోయే ట్రైలర్‌ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. దీనికి రాజమౌళి కుమారుడు టీమ్‌ చూసుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో చిత్ర సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ పర్యవేక్షణలో టెక్నికల్‌ హెడ్‌ సివి రావ్‌, కలరస్ట్‌ శివకుమార్‌ ఆ పనులు చూసుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆకతాయి'కి సెన్సార్ పూర్తి.. స్పెషల్ సాంగ్‌లో అమీషా పటేల్