Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి-2 తొలి ఆట చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు: దటీజ్ రాజమౌళి ఎగైన్

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 సినిమా ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 28న కాకుండా ముందస్తుగా 27 రాత్రే తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు అసాధారణ స్థాయిలో సినిమాపై సానుకూల అభిప్రాయాలు ప్రకటిస్త

Advertiesment
బాహుబలి-2 తొలి ఆట చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు: దటీజ్ రాజమౌళి ఎగైన్
హైదరాబాద్ , శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (06:32 IST)
దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 సినిమా ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 28న కాకుండా ముందస్తుగా 27 రాత్రే తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు అసాధారణ స్థాయిలో సినిమాపై సానుకూల అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. చిత్రంలోని ప్రధాన పాత్రధారుల నటన, అత్యున్నత నిర్మాణ కౌశలం చూస్తూ ప్రేక్షకులందరూ బాహుబలి-2 ముందు సాష్టాంగ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 
 
అత్యంత క్లుప్తంగా ఈ సినిమా కథ చెప్పాలంటే.. కట్టప్పతో కలిసి మాహిష్మతి రాజ్యంలో పర్యటిస్తున్న బాహుబలి దేవసేన (అనుష్క)తో ప్రేమలో పడతాడు. దేవసేన యుద్ధవిద్యలు తెలిసిన యువరాణి. సినిమా మొత్తంలో మలుపు ఏమిటంటే బాహుబలి దేవసేనను ప్రేమిస్తున్నాడని భల్లాల దేవుడు తెలుసుకోవడమే. తాను దేవసేనను ప్రేమిస్తున్నానని భల్లాలుడు తన తల్లి శివగామికి చెబుతాడు. కానీ దేవసేనను బాహుబలి ప్రేమిస్తున్న విషయం తెలియని రాజమాత శివగామి దేవసేనను తన కోడలుగా చేసుకుంటానని వర్తమానం పంపుతుంది. కానీ దేవసేన తిరస్కరిస్తుంది.దీంతో క్రుద్ధురాలైన శివగామి దేవసేనకు చెందిన కుంతల రాజ్యంపై దండెత్తమని బాహుబలికి సందేశం పంపుతుంది. బాహుబలి రాజమాత నిర్ణయాన్ని తప్పుపడతాడు. దీంతో ఆగ్రహించిన శివగామి భల్లాలుడిని మాహిష్మతి రాజును చేసి బాహుబలిని సైన్యాధిపతిగా నిర్ణయిస్తుంది. బాహుబలి అందుకు సమ్మతిస్తాడు కూడా. ఇప్పుడు బాహుబలిని చంపుతానని భల్లాలుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఇకపై ఏం జరుగుతుందన్నదే మొత్తం కథలో మూలమలుపు. 
 
గురువారం రాత్రే బాహుబలిని చూసిన ప్రేక్షకులు మంత్రముగ్ధులై సినిమా చూసిన అనుభూతిని పంచుకుంటున్నారు. సినిమా చూస్తూనే థియేటర్లోంచి ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా పంపిన వాళ్ల అభిప్రాయాల్లో కొన్ని..
 
సినిమా మొదలయ్యాక తొలి ప్రేమ్ నుంచి కళ్లప్పగించి చూస్తుండిపోయాను. అమరేంద్ర బాహుబలి అను నేను అంటూ బాహుబలి శపథం చేస్తున్న సీన్.. ఆ వెంటనే ఇంటర్వెల్ పడటం చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అందుకే తనను రాజమౌళి అంటున్నారు. అద్బుతమైన తొలి భాగం ఇప్పుడే చూసాను. వెరీ నైస్. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుతాడో తెలుసుకుంటాను. ఒకటి మాత్రం నిజం. ఇది బాహుబలి ది బిగినింగ్ కంటే భారీ స్థాయిలో ఉంది.
Sudhakar‏ @sudhakaryen
 
ఇప్పుడే చూశాను. లవ్ ఇట్. కంటికి అసలైన విందు. అద్భుత భావోద్వేగాలు, అద్వితీయ నటన. సీటు అంచున కూర్చుని చూశానంటే నమ్మండి. తప్పక చూడండి. మిస్ కావద్దు.
GD‏ @GuddaDengutha
 
బాహుబలి-2 అదించిన విఎప్ఎక్స్, విజువల్ గ్రాండియర్ తెరమీద చూస్తూ ఇప్పటికీ దిగ్భ్రాంతి  చెందుతూనే ఉన్నాను. కుంతలరాజ్యం ఎపిసోడ్ అయితే అనితరసాధ్యం అనేంత చక్కగా తీశారు. ఎలాంటి నటీనటులు ఎలాంటి దర్శకుడు, ఎలాంటి సినిమా.. హ్యాట్సాప్ టు యు రాజమౌళి సర్
Being Shajahan‏ @beingshajahan
 
ఈ మాగ్నిఫిషియంట్ వరల్డ్ క్లాస్ మూవీని చూస్తుంటే మాటలు రావడం లేదు. భారతీయ సినిమా తన అత్యుత్తమ దశకు ఇప్పడే చేరిందా అనిపిస్తోంది. రాజమౌళి ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్
#Bahubali2  BOT‏ @BO_Tollywood
 
ఫెంటాస్టిక్ పస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, కానీ విఎఫ్ఎక్స్ కోసం తప్పక చూడవలసిన సినిమా, తొలి భాగం, వార్ ఎపిసోడ్స్ అద్భుతం
Lijo‏ @lijotjose86
 
డన్ బాహుబలి, సెకండ్ హాప్ ఎంత బాగుందో.. మాటల్లేవ్. బాహుహలి రూల్స్ ది వరల్డ్
srikanth‏ @srikanth_mahi
 
బాహుహలి-2 సెకండ్ హాఫ్ ప్రపంచ స్థాయి సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. బాహుబలి ఈజ్ అలైవ్. వాచ్ ఇట్. అమేజింగ్ మూవీ
Sri Harsha Vardhan‏ @Polusriharsha
 
బాహుబలి2 ఈసారి సరదా, ప్రేమ, సెంటిమెంట్, ఎపిక్ వార్, సూపర్బ్ స్టోరీ. అనుష్క ఎపిసోడ్ లవ్లీ.. అండ్ సూపర్బ్ యాక్టింగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ పీక్స్ విత్ బాహుబలి నేమ్ ఎగైన్ పస్ట్ హాప్ ఆల్ చంపేశాడు రాజమౌళి 
Mohit Dantre‏ @MoooPoint

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్కటి మినహా "బాహుబలి 2" అత్యద్భుతం... విజువల్ వండర్... రేటింగ్ 5/5... సాహోరే రాజమౌళి.. (రివ్యూ)