Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క అల్లాడించేసింది... ప్రభాస్, రానా విశ్వరూపం చూపించారు... భళి రాజమౌళి...

బాహుబలి కంక్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలి చిత్రాన్ని తీసిన రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజమౌళి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ సత్తాను చాటిచెప్పాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే చి

Advertiesment
Baahubali2 review
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (14:07 IST)
బాహుబలి కంక్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలి చిత్రాన్ని తీసిన రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజమౌళి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ సత్తాను చాటిచెప్పాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ అత్యద్భుత నటన కనబరిచాడు. రెండు పాత్రల్లో భిన్నత్వాన్ని చూపించాడు. పోరాట సన్నివేశాల్లో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా వుంది. 
 
నటనలో ప్రభాస్‌తో రానా పోటీపడి నటించాడు. రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటికైనా తెగించే క్రూరుడుగా రానా తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రభాస్ తో తలపడే సన్నివేశాల్లో రానా నువ్వా నేనా అన్నట్లుగా పెర్ఫార్మెన్స్ చేశాడు. మొదటి భాగంలో డీగ్లామర్‌గా కనిపించిన దేవసేన(అనుష్క) రెండో భాగంలో అల్లాడించేసింది. అత్యంత సౌందర్యవతిగా అందర్నీ ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ అనుష్క మాత్రమే చేయగలదని అనిపించేలా తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకుంది. 
 
కట్టప్ప అనేవాడు నిజంగా వుంటే ఇలాగే వుంటాడా అనేంతగా సత్యరాజ్ ఆ పాత్రలో జీవించేశాడు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అదరగొట్టేసింది. మొత్తంగా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి రెండో భాగాన్ని కూడా అత్యద్భుతంగా తెరకెక్కించాడు. మరోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పం అంటున్నారు. మీరు కూడా ఆ సస్పెన్సుతో సినిమా చూడండి అనడం కొసమెరుపు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు మా పక్కనుండగా.. అంతటి మగాడింకా పుట్టలేదు రాజమౌళి మామా.. నాని