Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్-అనుష్క 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'... పెళ్లాడితే చూడాలనుంది...

ప్రభాస్-అనుష్క అనగానే ఇప్పుడు అమరేంద్ర బాహుబలి-దేవసేనలు చటుక్కున గుర్తుకు వచ్చేస్తారు. ఇప్పుడు వీరిద్దరి జంటపై నెటిజన్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు ఆసక్తికరంగా వుంటున్నాయి. బాహుబలి 2 చిత్రం చూశాక చా

Advertiesment
baahubali2
, మంగళవారం, 2 మే 2017 (20:55 IST)
ప్రభాస్-అనుష్క అనగానే ఇప్పుడు అమరేంద్ర బాహుబలి-దేవసేనలు చటుక్కున గుర్తుకు వచ్చేస్తారు. ఇప్పుడు వీరిద్దరి జంటపై నెటిజన్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు ఆసక్తికరంగా వుంటున్నాయి. బాహుబలి 2 చిత్రం చూశాక చాలామంది ఓ విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రభాస్ - అనుష్క ఇద్దరూ చిత్రంలో 'మేడ్ ఫర్ ఈచ్ అదర్‌'లా వున్నారనీ, చూడచక్కని జంటగా కనిపించారని కితాబిస్తూనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుందని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. సహజంగా కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రమే ఇలా జతగా అమరుతుంటారు. అలాంటివారిలో ప్రభాస్-అనుష్కలు కూడా. అందువల్లనే కొందరు ప్రభాస్-అనుష్క మ్యారేజ్ అంటూ తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. 
 
ఇకపోతే అనుష్క ఇప్పటికే 30 ఇయర్స్ క్రాస్ చేసేసింది. 30 ప్లస్ కనుక ఇక సినిమా ఆఫర్లు తగ్గిపోతాయిలే అనుకుంటే ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చేస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ కూడా పెళ్లి గురించి చిత్రం విడుదలైన తర్వాత తీపి కబురు చెప్తానని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఏం చెపుతారో... స్వీటీ అనుష్క తన పెళ్లి గురించి ఏమయినా చెపుతుందా అనే ఆసక్తి నెలకొని వుంది. నెటిజన్లు అంటున్నట్లుగా వీరేమైనా ఆ దిశగా కూడా ఆలోచనలు చేసుకుంటారేమో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి-2' మూవీ థియేటర్ టిక్కెట్ ధర రూ.200 : బ్లాక్‌లో రూ.1000 చెల్లించి కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి?