Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 7న 'బాహుబలి' రిలీజ్... ఎందుకంటే..

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానాలు హీరోలుగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం తొలి భాగం గత 2015లో విడుదలై రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం రెండో భాగం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'బాహుబల

Advertiesment
ఏప్రిల్ 7న 'బాహుబలి' రిలీజ్... ఎందుకంటే..
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (10:24 IST)
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానాలు హీరోలుగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం తొలి భాగం గత 2015లో విడుదలై రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం రెండో భాగం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి' తొలి భాగాన్ని మరోమారు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. 
 
దీంతో తెలుగు సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రాన్ని మరోసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 28న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి మొదటి భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రలు పోషించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవసేనను 'బాహుబలి' ఏం చేశాడంటే... టీవీ సీరియల్‌గా తీస్తా : ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటన