Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భళి భళి భళిరా భళి.. పాటను ఇండోనేషియా యువకులు పాడితే? (video)

బాహుబలికి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చైనాలో సెప్టెంబరులో రిలీజ్ కానుంది. తద్వారా అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసేందుకు రాజమౌళి బాహుబలి రెడ

భళి భళి భళిరా భళి.. పాటను ఇండోనేషియా యువకులు పాడితే? (video)
, మంగళవారం, 11 జులై 2017 (17:28 IST)
బాహుబలికి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చైనాలో సెప్టెంబరులో రిలీజ్ కానుంది. తద్వారా అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసేందుకు రాజమౌళి బాహుబలి రెడీ అవుతోంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

చైనాలో 40వేల స్క్రీన్లపై ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. భారత్‌‍లో బాహుబలిని 8వేల స్క్రీన్లపై మాత్రమే ప్రదర్శించినట్లు తెలిపారు. వినోదానికి భాష, దేశాలు అడ్డుకావని రాజమౌళి అన్నారు.  
 
రాజమౌళి మాటలకు నిదర్శనంగా చిత్రంలోని బాహుబలి ఎంట్రీ ఇచ్చే సాంగ్ "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి... అనే పాటను విదేశీయులు కూడా ఎంచక్కా పాడేస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన కొందరు యువకులు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్‌ పాట వస్తుంటే వారంతా లిరిక్స్‌కి తగ్గట్టుగా లిప్‌సింక్ చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

ఇప్పటికే ఈ వీడియోకు 131,430 వ్యూస్ వచ్చేశాయి. లైక్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తన ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరింత అందంగా కనిపించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్?