రాజమౌళి కుమారుడికి నిశ్చితార్థం.. ఇంతకీ ఈ పూజా ప్రసాద్ ఎవరో తెలుసా? (Photos)
						
		
						
				
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి... ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తన కొడుకు పెళ్ల
			
		          
	  
	
		
										
								
																	దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి... ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు. 
	
	 
	రాజమౌళి తనయుడు కార్తికేయ.. తండ్రి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా అతడు గాయని పూజా ప్రసాద్‌ను ప్రేమిస్తున్నాడు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు. ఇంతకీ ఈ పూజా ప్రసాద్ ఎవరో కాదు.. నటుడు జగపతి బాబు అన్నయ్య రామ్ ప్రసాద్ కుమార్తె.
	
వీరి నిశ్చితార్ధానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, అఖిల్ వంటి తారలు వీరి నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. అయితే పెళ్లి ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు.